6 sixes off 6 balls: ఇప్పటివరకు నలుగురు భారత క్రికెటర్లు కూడా ఒకే ఓవర్ లో 6 సిక్సర్లు బాది చరిత్ర సృష్టించారు. ఈ లిస్టులో మరో భారత యంగ్ ప్లేయర్ చేరాడు. ఒకే ఓవర్ (ఆరు బంతుల్లో ) 6 సిక్సర్లు బాది సంచలన ఇన్నింగ్స్ తో సెంచరీ బాదాడు.
six sixes - Abhijit Praveen: క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లతో సంచలనం రేపాడు యంగ్ ప్లేయర్. ఇప్పటివరకు ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదిన నలుగురు భారత ప్లేయర్ల లిస్టులో చేరాడు. ఇటీవల జరిగిన సీకే నాయుడు ట్రోఫీలో ఆంధ్ర ఓపెనర్ వంశీకృష్ణ ఒక ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు. ఆ ఛాన్స్ కేరళకు చెందిన అభిజిత్ ప్రవీణ్‌కి దక్కింది. త్రిసూర్‌లోని ఆత్రేయ క్రికెట్ అకాడమీ మైదానంలో జరిగిన నావియో యూత్ ట్రోఫీ అండర్-22 క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌లో అభిజిత్ సంచలన బ్యాటింగ్ తో చరిత్ర సృష్టించాడు. ఒకే ఒవర్ లో ఆరు సిక్సర్లు బాదిన ఐదో భారత ప్లేయర్ గా ఘనత సాధించాడు.
తిరువనంతపురం మాస్టర్స్ సీసీ తరఫున ఆడిన అభిజిత్ ప్రవీణ్ 21వ ఓవర్ లో ఆరు సిక్సర్లు బాదాడు. త్రిసూర్ ట్రైడెంట్ క్రికెట్ అకాడమీకి చెందిన లెగ్ స్పిన్నర్ జో ఫ్రాన్సిస్ బౌలింగ్ ను ఉతికిపారేస్తూ ఈ ఘనత సాధించాడు. 30 ఓవర్ల గేమ్‌లో జో తన రెండో ఓవర్‌ని బౌలింగ్ చేసినప్పుడు అభిజిత్ హాఫ్ సెంచరీ తర్వాత 69 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. జో మొదటి రెండు బంతులు లాంగ్ ఆఫ్ మీదుగా సిక్సర్లుగా మలిచాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా మూడు, నాలుగో బంతిని కూడా సిక్సర్ కొట్టాడు. చివరి రెండు బంతులను కూడా సిక్సర్లగా మలిచి చరిత్ర సృష్టిస్తూ సెంచరీ (105 పరుగులు) సాధించాడు.
undefined
IPL 2024: కొత్త సీజన్.. కొత్త రోల్.. ! చెన్నై ఓపెనర్ గా ఎంఎస్ ధోని.. !
అభిజిత్ ప్రవీణ్ తన ఇన్నింగ్స్‌లో 52 బంతుల్లో 10 సిక్సర్లు, రెండు ఫోర్లు బాదాడు. మీడియం-పేస్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన అభిజిత్ గత డిసెంబర్‌లో బెంగళూరులో జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో సిక్కింతో జరిగిన మ్యాచ్‌లో కేరళ తరపున అరంగేట్రం చేశాడు. ఆ గేమ్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే, బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తాజా ఇన్నింగ్స్ లో వరుసగా ఒకే ఓవర్ లో ఆరు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేయడం సంతోషంగా ఉందని అభిజిత్ తెలిపాడు. అంతకుముందు కూడా ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాదిన ఆటగాడు అభిజిత్ గుర్తింపు సాధించాడు. ఆ తర్వాతి మ్యాచ్ లో ఆరు సిక్సర్లు కొట్టాలనుకున్నాననీ, ఇప్పుడు ఆ కల నిజమైందని అన్నాడు.
సచిన్-ధోనీ-విరాట్ కంటే ఖరీదైన ఇల్లు.. ఈ భారత క్రికెట్ క్వీన్ ఎవరో తెలుసా?