బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి పోస్టాఫీస్‌‌.. ఏప్రిల్‌కల్లా ఇతర బ్యాంకులతో అనుసంధానం!

By S Ashok KumarFirst Published Jan 5, 2021, 1:21 PM IST
Highlights

లాక్ డౌన్ సమయంలో రైల్వే, రోడ్డు రవాణా, వైమానిక సర్వీస్ నిలిచిపోయినప్పటికీ కీలకమైన పార్సిల్‌ డెలివరీలు అందించడంలో పోస్టల్ శాఖ ముందంజలో ఉంది. 

ఈ ఏడాది 2021  ఏప్రిల్ నాటికి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఇతర బ్యాంకు ఖాతాలతో కలసికట్టుగా నిర్వహించేందుకు, అలాగే అన్ని సర్వీసులను డిజిటలైజేషన్ చేయాలని భావిస్తున్నట్లు ఇండియా పోస్ట్ తెలిపింది.

లాక్ డౌన్ సమయంలో రైల్వే, రోడ్డు రవాణా, వైమానిక సర్వీస్ నిలిచిపోయినప్పటికీ కీలకమైన పార్సిల్‌ డెలివరీలు అందించడంలో పోస్టల్ శాఖ ముందంజలో ఉంది. 

"రాబోయే సంవత్సరంలో సేవలను డిజిటలైజ్ చేయడంతో పాటు డోర్ డెలివరీ సర్వీస్ చేయడంపై మా దృష్టిని పెంచుతాము. మా బ్యాంకింగ్ సర్వీసెస్, ఆర్థిక సేవలు ఇప్పటికే డిజిటలైజ్ చేయబడ్డాయి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ కూడా ఏప్రిల్ నాటికి ఇతర బ్యాంకుల ఖాతాలతో నేరుగా పనిచేయగలదని మేము భావిస్తున్నాము" బిసోయి అన్నారు.

పోస్ట్ ఆఫీస్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (సిబిఎస్) వ్యవస్థ ప్రపంచంలోనే అతిపెద్దది, ఈ నెట్‌వర్క్‌లో ఇప్పటికే 23,483 పోస్టాఫీసులు ఉన్నాయి. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా 1.56 లక్షల పోస్టాఫీసుల ద్వారా 50 కోట్లకు పైగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (పిఓఎస్‌బి) వినియోగదారులకు సేవలు అందిస్తుంది. పిఒఎస్‌బి పథకాల కింద రూ.10.81 కోట్ల బకాయి ఉంది.

అన్ని పిఓఎస్‌బి ఖాతాలను ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐ‌పి‌పి‌బి) ఖాతాలతో అనుసంధానించవచ్చు, దీనిని మొబైల్ యాప్ డాక్ పే ద్వారా నిర్వహించవచ్చు.

also read 

"సర్వీసులను ప్రజలకు డిజిటల్‌గా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు, మేము డోర్ స్టెప్ డెలివరీ సేవలను అందించడంపై దృష్టి పెడుతున్నాము. ఈ సంవత్సరం మేము సుమారు 85 లక్షల లావాదేవీల ద్వారా 900 కోట్ల రూపాయల డబ్బును అందించాము" అని బిసోయి చెప్పారు.

లాక్ డౌన్ సమయంలో రవాణా  నిలిచిపోయినప్పటికి అవసరమైన పార్సెల్స్ డెలివరీ బాధ్యతను ఇండియా పోస్ట్ నిర్వహించాల్సి వచ్చింది.80 నగరాలను 56 మార్గాల్లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్టులు (డిఓపి) జాతీయ స్థాయిలో 'రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్' ను ప్రారంభించింది. ఈ నెట్‌వర్క్ ద్వారా ప్రతిరోజూ 75 టన్నుల సుమారు 15 వేల పార్సెల్స్  అందించింది.

"మేము ఇప్పుడు సంవత్సరానికి 9 కోట్ల పార్శిల్ నిర్వహణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము. స్పీడ్ పోస్ట్ సగటు రవాణా సమయం 2019 జూలైలో 105 గంటల నుండి 2020 ఫిబ్రవరిలో 81 గంటలకు తగ్గింది" అని బిసోయి చెప్పారు.

లాక్ డౌన్ సమయంలో పోస్టల్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా వైద్య డెలివరీలు కలిగి ఉంది, వాటిలో వైద్య పరికరాల బాక్సులు, వెంటిలేటర్లు, పిపిఇ కిట్లు, మందులు ఉన్నాయి. సుమారు 36వేల టన్నుల సామగ్రిని పోస్టల్ చానెళ్ల ద్వారా పంపిణీ చేశారు, వీటిలో ట్రైన్స్ పార్శిల్ వాడకం కూడా ఉంది.

మందులు మాత్రమే కాదు, ఇండియా పోస్ట్ 2020 ఏప్రిల్-నవంబర్ మధ్య గంగాజల్‌ను 2.37 లక్షల గృహాలకు పంపిణీ చేసింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఇండియా పోస్ట్ వ్యాపారం తగ్గిపోయిందని, అయితే ఇప్పుడు అది సాధారణ స్థితికి చేరుకుంటుందని బిసోయి తెలిపారు.
 

click me!