పసిడి, వెండి ధరలకు రెక్కలు.. కొనేముందు నేటి 24 క్యారెట్ల 10 గ్రాముల ధర తెలుసుకోండి..

By asianet news teluguFirst Published Dec 5, 2022, 10:08 AM IST
Highlights

నేడు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ. 53,950 వద్ద, వెండి కిలో ధర రూ.65,200గా ఉంది.
 

 వివాహాలతో సహా అన్ని శుభకార్యాలకు  మహిళలు ఎక్కువగా బంగారం, వెండి ఆభరణాల షాపింగ్ చేస్తుంటారు. అయితే నేడు అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మళ్లీ ఎగిశాయి. 

పసిడి, వెండి ధరల హెచ్చుతగ్గుల నేపథ్యంలో బంగారం ధరలు రానున్న రోజుల్లో తగ్గుతాయా.. లేదా  అన్నది మార్కెట్ నిపుణులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. నేడు సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో 10 గ్రాముల పసిడి 24 క్యారెట్ల ధర రూ. 53,950 వద్ద, వెండి కిలో ధర రూ.65,200గా ఉంది.

ఒక నివేదిక  ప్రకారం, ఈరోజు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,450 వద్ద ట్రేడవుతోంది. ముంబై, కోల్‌కతా అండ్ హైదరాబాద్‌లలో పది గ్రాముల బంగారం 24 క్యారెట్లు ధర రూ. 53,950, 22 క్యారెట్ల ధర రూ. 49,450 వద్ద ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల  బంగారం ధర రూ. 54,100, 22 క్యారెట్ల ధర రూ. 49,600 వద్ద ట్రేడవుతోంది. చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,720, 22 క్యారెట్ల ధర రూ.50,160గా ఉంది.

 0027 GMT నాటికి స్పాట్ బంగారం 0.1 శాతం పెరిగి ఔన్సుకు $1,800.02 డాలర్లకి చేరుకుంది. US గోల్డ్ ఫ్యూచర్స్ 0.2 శాతం పెరిగి $1,812.60 డాలర్ల వద్ద ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 0.1 శాతం తగ్గింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రబ.81.43 వద్ద స్థిరంగా ఉంది. 

స్పాట్ వెండి 0.5 శాతం పెరిగి 23.25 డాలర్లకు చేరుకుంది. ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ.65,200గా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో కిలో రూ.71,600 వద్ద ట్రేడవుతోంది.


బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, పెళ్లిళ్ల సీజన్ కావడంతో రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరల పెరుగుదల దశ కొనసాగుతుంది. అలాగే త్వరలో కొత్త సంవత్సరం అంటే  2023లో బంగారం ధర గరిష్ట స్థాయికి సమీపంలో లేదా అంతకంటే ఎక్కువ చేరవచ్చు.  

నేటి పెళ్లిళ్ల సీజన్‌లోనూ బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు కొన్నిసార్లు పెరుగుతుండగా, కొన్నిసార్లు తగ్గుతున్నాయి. 

ఇక్కడ పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి అలాగే ప్రతిరోజూ మారుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్ కరెన్సీ ధరలలో మార్పు, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు ఇంకా ఎన్నో ఇతర కారణాలు బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణాలు అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

click me!