ముంచుకొస్తున్న డీజిల్ సంక్షోభం... ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న డీజిల్ సంక్షోభం భారత్‌లోనూ వస్తుందా..

By Krishna AdithyaFirst Published Nov 23, 2022, 11:48 PM IST
Highlights

రాబోయే 6 నెలల్లో ప్రపంచం మొత్తం భయంకరమైన సమస్యను ఎదుర్కోవచ్చు.  డీజిల్ సరఫరాలో కొరత కారణంగా, ఈ అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అన్ని దేశాల ముందు ఈ సంక్షోభం తలెత్తవచ్చు. భారతదేశంలో కూడా డీజిల్ ఆధారంగా అనేక వ్యాపారాలు ఉన్నాయి, డీజిల్ లో నడిచే వాహనాల చక్రం ఆగిపోతే, భయంకరమైన పరిస్థితి తలెత్తుతుంది.

మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే  ఇంధనం డీజిల్. రైళ్లు, ట్రక్కులు, బస్సులు, వ్యవసాయ ట్రాక్టర్లు  డీజిల్ తోనే నడుస్తాయ. ఇది కాకుండా, డీజిల్ నిర్మాణ, తయారీ, వ్యవసాయంలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇక  చలి దేశాలలో గృహాలను వేడి చేయడానికి కూడా డీజిల్ ఉపయోగించబడుతుంది. సహజవాయువు ధరలు విపరీతంగా పెరిగినప్పుడు, దానికి బదులుగా డీజిల్ ఉపయోగిస్తుంటారు.. అయితే డీజిల్ సరఫరాలో కొరత కారణంగా, ప్రపంచ ఇంధన మార్కెట్ రాబోయే నెలల్లో డీజిల్ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 

డీజిల్ సంక్షోభం కారణంగా, దాని ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో సైతం డీజిల్ ధరలు పెరగడం వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థపై 100 బిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. 

 US ఆయిల్ స్టాక్స్ నాలుగు దశాబ్దాల కనిష్టానికి చేరాయి. నార్త్ వెస్ట్ ఐరోపాలో స్టాక్ కొరత డీజిల్ సంక్షోభం పెంచుతోంది. రష్యాపై విధించిన ఆర్థిక ఆంక్షలు అమలులోకి వచ్చిన తర్వాత 2023 మార్చిలో ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుంది. ఇప్పటికే పలు దేశాల అవసరాల కోసం డీజిల్ మార్కెట్లో దొరకడం లేదు. దీంతో చాలా దేశాలు  సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున ప్రపంచ ఎగుమతి మార్కెట్లో డీజిల్ సంక్షోభం ప్రారంభం కానుంది.

న్యూయార్క్ హార్బర్ స్పాట్ మార్కెట్‌లో ఈ ఏడాది డీజిల్ ధరలు 50 శాతం పెరిగాయి.నవంబర్‌లో గాలన్ ధర 4.90 డాలర్లకి చేరుకుంది, అంతకు ముందు సంవత్సరం కంటే రెట్టింపు కంటే ఎక్కువ.

డీజిల్ కొరత ఎందుకు?
ప్రపంచవ్యాప్తంగా రిఫైనింగ్ సామర్థ్యం క్షీణించింది. ముడి చమురు సరఫరాలో కూడా సమస్యలు ఉన్నాయి. కానీ ముడి చమురును పెట్రోల్, డీజిల్‌లోకి శుద్ధి చేయవలసి వచ్చినప్పుడు ఇబ్బందులు పెరుగుతాయి. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో డిమాండ్ పడిపోయిన తరువాత రిఫైనింగ్ కంపెనీలు తక్కువ లాభదాయకమైన ప్లాంట్లను మూసివేసాయి. 

US రిఫైనింగ్ సామర్థ్యం 2020 నుండి రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ తగ్గింది. ఐరోపాలో షిప్పింగ్ అంతరాయాలు, కార్మిక సమ్మెల కారణంగా రిఫైనింగ్ ప్రభావితమైంది. రష్యా నుంచి సరఫరా నిలిచిపోయిన తర్వాత ఇబ్బందులు పెరిగాయి. ఐరోపా దేశాలు డీజిల్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. EU సముద్ర మార్గాల ద్వారా రష్యాకు పంపిణీ చేయబడిన డీజిల్‌పై నిషేధం ఫిబ్రవరి నుండి అమలులోకి వస్తుంది.రష్యా నుండి సరఫరాలను భర్తీ చేయకపోతే, యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. చలికాలం కారణంగా యూరప్ లో డీజిల్ సమస్య తీవ్రమైంది.

భారత్, చైనాలు లాభపడే అవకాశం..
డీజిల్ సంక్షోభం నుండి భారతీయ, చైనీస్ రిఫైనింగ్ కంపెనీలు లాభపడతాయి. ఇప్పటికే చిన్న దేశాలకు డీజిల్ ను ప్రీమియంతో విక్రయిస్తున్నాయి. పేద దేశాలకు డీజిల్ కొనడం కష్టం. ఉదాహరణకు, ఇంధనం కొనుగోలు చేయడంలో శ్రీలంక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. థాయ్‌లాండ్ డీజిల్‌పై పన్నులను తగ్గించడంతో, సరఫరాను పెంచడానికి వియత్నాం అత్యవసర చర్యలు తీసుకుంటుంది.
 

 

click me!