Breaking News: రెపోరేటును 0.50 శాతం పెంచిన RBI, భారీగా పెరగనున్న నెలవారీ EMI, సొంతిల్లు కొనేవారికి షాక్..

By Krishna AdithyaFirst Published Sep 30, 2022, 10:44 AM IST
Highlights

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను పెంచింది. నేడు మానిటరీ పాలసీని ప్రకటించిన ఆర్‌బీఐ రెపో రేటును 0.50 శాతం పెంచింది. దీంతో గృహ, వాహన దారులు చెల్లించే EMIలు భారీగా పెరగనున్నాయి. 

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. ఈరోజు మానిటరీ పాలసీని ప్రకటించిన ఆర్‌బీఐ రెపో రేటును 0.50 శాతం పెంచింది. దీంతో గృహ, కారు ఇతర రుణాలు  వినియోగదారులకు మరింత ఖరీదు అవుతున్నాయి. అయితే, డిపాజిట్లపై వడ్డీ రేట్లు మాత్రం పెరిదగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు, "ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని మందగమనం, అధిక ద్రవ్యోల్బణం వల్ల పెరుగుతున్న భయాలతో భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉంటుందని” దాస్ అన్నారు. 

ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో ద్రవ్య విధాన కమిటీ పాలసీ రేటు రెపోను 0.50 శాతం పెంచాలని నిర్ణయించిందని, ఈ పెంపుతో  రెపో రేటు  5.90 శాతంగా మారిందని ఆర్‌బిఐ గవర్నర్ దాస్ తెలిపారు. ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులలో ఐదుగురు పాలసీ రేటు పెంపునకు మద్దతు పలికారు. 

కోవిడ్ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకుల దూకుడు రేట్ల పెంపు కారణంగా మనం కొత్త 'తుఫాను'ను ఎదుర్కొంటున్నామని ద్రవ్య విధాన సమీక్షను సమర్పిస్తూ ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు.

అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం  US డాలర్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు. ప్రపంచ వృద్ధి మందగించడం, ఆహారం, ఇంధన ధరలు పెరగడం, అధునాతన ఆర్థిక విధానాల నుండి రుణ సంక్షోభం, రూపీ కరెన్సీ విలువ  తరుగుదల నుండి సవాళ్లను ఎదుర్కొంటోందని దాస్ అన్నారు.

రెపో రేటు అంటే ఏమిటి?: దీన్ని సరళమైన భాషలో ఇలా అర్థం చేసుకోవచ్చు. బ్యాంకులు మనకు రుణాలు ఇస్తాయి. ఆ రుణానికి మనం వడ్డీ చెల్లించాలి. అదేవిధంగా, బ్యాంకులు కూడా వారి రోజువారీ కార్యకలాపాలకు భారీ మొత్తం అవసరం. అందుకు బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుండి రుణాలు తీసుకుంటాయి. రిజర్వ్ బ్యాంక్ వారి నుండి ఈ రుణంపై వడ్డీని వసూలు చేస్తుందిన. దీన్నే  రెపో రేటు అంటారు.

రెపో రేటు సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది
బ్యాంకులు తక్కువ వడ్డీ రేటుతో రుణాన్ని పొందినప్పుడు అంటే రెపో రేటు తక్కువగా ఉన్నప్పుడు వారు తమ కస్టమర్లకు చౌకగా గృహ, వాహన, కమర్షియల్ రుణాలను అందిస్తారు. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచినట్లయితే, బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే రుణాలు ఖరీదుగా మారుతాయి.  

tags
click me!