మార్చిలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏ తేదీలలో బ్యాంకులు తెరిచి ఉంటాయో తెలుసుకోండి...

By S Ashok KumarFirst Published Feb 27, 2021, 6:42 PM IST
Highlights

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సురక్షితమైన భౌతిక దూరం నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తమ బ్యాంకింగ్ పనులను పరిష్కరించుకోవాలని సూచించింది. 

మీరు మార్చ్ నెలలో ఏదైనా  ముఖ్యమైన బ్యాంక్ పని చేయవలసి వస్తే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైనది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సురక్షితమైన భౌతిక దూరం నియమాన్ని పాటించడం చాలా ముఖ్యం.

ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వినియోగదారులకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా తమ బ్యాంకింగ్ పనులను పరిష్కరించుకోవాలని సూచించింది. ఒకవేళ  బ్రాంచ్‌కు వెళ్లవలసిన అవసరం ఉంటే 2021 మార్చిలో బ్యాంకులు ఏ రోజు మూసివేయబడతాయో  కస్టమర్లు ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది.


ఆర్‌బిఐ వెబ్‌సైట్‌లో లభించిన సమాచారం ప్రకారం మార్చి నెలలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఐదు సెలవులు నిర్ణయించబడ్డాయి. ఈ సెలవులు 5, 11, 22, 29, 30 తేదీలలో ఉన్నాయి. 

తేదీ                             హాలీ డే 
5 మార్చి 2021         చాప్చర్ కుట్ 
11 మార్చి 2021      మహాశివరాత్రి
22 మార్చి 2021          బీహార్ డే
29 మార్చి 2021            హోలీ
30 మార్చి 2021    (పాట్నా  రాష్ట్రం ) హోలీ

also read 

శని, ఆదివారాలు కూడా చేర్చితే  మొత్తం సెలవులు 11 అవుతాయి. మార్చి 7, మార్చి 14, మార్చి 21, మార్చి 28 ఆదివారాలు కాబట్టి ఈ రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. ఇది కాకుండా మార్చి 13  రెండవ శనివారం, మార్చి 27 నాల్గవ శనివారం కాబట్టి ఈ రోజుల్లో  కూడా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. 

మార్చి 15,  16న సమ్మె  
బ్యాంకు యూనియన్లు బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  మార్చి 15, 16న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.  దీంతో బ్యాంకులు మార్చిలో వరుసగా నాలుగు రోజులు మూసివేయబడతాయి, ఈ నెల రెండవ శనివారం 13న, ఆదివారం 14 న, బ్యాంక్ ఉద్యోగుల అత్యున్నత సంస్థ అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) 2021 మార్చిలో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు నిరసనగా ఫోరం సమ్మెకు పిలుపునిచ్చింది. 

యూ‌ఎఫ్‌బి‌యూ సభ్యులలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (AIBOA), బ్యాంక్ ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (INBEF), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (INBOC), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ (NOBW) నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (NOBO) కూడా ఉన్నాయి.

గమనిక : ఈ సెలవులు   ప్రతి రాష్ట్రాన్ని బట్టి  మారుతుండొచ్చు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బిఐ ) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
 

click me!