వచ్చే రెండేళ్లూ విపణిలోకి మోడర్న్ ఫీచర్స్ కార్స్

By rajesh yFirst Published Mar 30, 2019, 11:16 AM IST
Highlights

మారుతి టు టాటా.. మధ్యలో రెనాల్డ్, హ్యుండాయ్ వంటి ఆటోమొబైల్ సంస్థలు కార్ల ప్రేమికుల మనస్సు దోచేందుకు మోడర్న్ రూపంలో ముందుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు తమను ఆదరించిన మోడల్ కార్లకు నూతన సొబగులద్దీ.. అధునాతన ఫీచర్లు జత చేసి భారత విపణిలోకి వదిలిపెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నాయి. 

న్యూఢిల్లీ: కార్లు, మోటారు బైక్‌ల ప్రేమికులకు గుడ్ న్యూస్. అవును మరి ఆటోమొబైల్ సంస్థలు కుర్రకారును ఆకర్షించేందుకు ద్రుష్టిని కేంద్రీకరించాయి. ప్రస్తుతం విపణిలో ఉన్న మోడల్ కార్లకు కొత్త సొబగులద్దీ, అధునాతన ఫీచర్లు జోడించీ మరీ తిరిగి మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. మరికొన్ని మార్కెట్‌లో ఆదరణ లేని వెహికల్స్‌ను విత్ డ్రా చేస్తున్నాయి. కియా మోటార్స్, మారుతి సుజుకి, ఎంజీ మోటార్స్ మొదలు టయోటా, రెనాల్ట్ తదితర ఇంటర్నేషనల్ కార్ల తయారీ సంస్థలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ఒక్కసారి ఆ వివరాలను పరిశీలిద్దాం.. 

2019 చివరిలోగా మార్కెట్‌లోకి రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్
అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థల్లో ఒక్కటైన రెనాల్ట్ తన ‘క్విడ్’ ఫేస్ లిఫ్ట్ మోడల్ కారును రీ ఫ్రెష్ చేసి అధునాతన ఫీచర్లతో ఈ ఏడాది పండుగల సీజన్‌లో ఆవిష్కరించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నది. ప్రత్యేకించి స్టాండర్డ్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్, ఈబీడీ తదితర సేఫ్టీ ఫీచర్లను మరింత డెవలప్ చేసి కస్టమర్ల మనస్సు దోచేందుకు సిద్ధం అవుతోంది. అప్ డేటెడ్ ఇన్ఫోటైన్మెంట్, రీ డిజైన్డ్ క్లస్టర్ తదితరాలు అప్ డేట్ అవుతాయి. అయినా పాత రెనాల్డ్ క్విడ్ మోడల్ ధరే కొత్త కారుకు వర్తింపజేసే అవకాశం ఉంది. 

      

నూతన రూపంలో మారుతి సుజుకి ఆల్టో
2019 చివరిలోగా నూతన మోడల్‌లో మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు మారుతి సుజుకి ఆల్టో సంసిద్ధం అవుతోంది. కొత్త మోడల్ ఆల్టో కారు స్వల్పంగా ఎస్‪యూవీ ని పోలి ఉంటుంది. మౌంటెడ్ ఇన్‌స్ట్రుమెంట్, టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎఎంటీ బాక్స్, 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్, 90ఎన్ఎం టార్చితోపాటు 68 పీఎస్ ఆఫ్ ఫవర్ కలగలిపి మార్కెట్లోకి ఫ్యూచర్ కాన్సెప్ట్ కారుగా రానున్నది. రెనాల్ట్ క్విడ్, డస్టన్ రెడీ గో మోడల్ కార్లకు ధీటుగా మార్కెట్లోకి దూసుకెళ్లనున్నది. 

               

రెండేళ్లలో లాంచింగ్‌కు రెనాల్ట్ క్విడ్ ఈవీ
రెనాల్ట్ ఇండియా భారతదేశంలో తన పేరొందిన మోడల్ కారు ‘క్విడ్’ను విద్యుత్ వినియోగ వాహనంగా మరో రెండేళ్లలో తీసుకు రానున్నది. అదే నిజమైతే భారతదేశ మార్కెట్లో అడుగు పెట్టే తొలి విద్యుత్ మోడల్ కారు అవుతుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 260 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చు. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రీ డిజైన్ చేసిన బంపర్, రెగ్యులర్ క్విడ్ హ్యాచ్ బ్యాక్ జోడించనున్నారు. దీన్ని ప్రత్యేకించి చైనా మార్కెట్ కోసం దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఎప్పుడు డెవలప్ చేస్తారన్నదని అధికారికంగా ప్రకటించలేదు. కానీ రెండు, మూడేళ్లలో మార్కెట్లో ఆవిష్కరిస్తారు. 

               

మరో రెండు నెలల్లో విపణిలోకి టాటా టియాగో విద్యుత్ కారు
టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన నూతన మోడల్ కారు టియాగో విద్యుత్ వర్షన్ కారుగా రెండు నెలల్లో మార్కెట్లోకి రానున్నది. ఇందులో 85 కిలో వాట్ల సామర్థ్యం గల విద్యుత్ మోటార్, 115 పీఎస్ పవర్ గల మోటార్ ఉంటుంది. అంతేకాదు విద్యుత్ మోటార్ ఇంజిన్ బే.. ఫ్రంట్ వీల్స్  టర్నింగ్‌లో ఉంటుంది. 200 ఎన్ఎం సామర్థ్యంతోపాటు సింగిల్ స్పీడ్ ట్రాన్సిమిషన్ సామర్థ్యం గల కారు ఇది. ఇది ఒకసారి చార్జింగ్ చేస్తే సుమారు 140 కిలోమీటర్ల దూరం యథేచ్ఛగా ప్రయాణిస్తుంది. దీన్ని కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ఫేమ్ -2 పథకంలో చేర్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

             

వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రోడ్లపైకి గ్రాండ్ ఐ10
దక్షిణ కొరియా ఆటోమొబైల్ మేజర్ హ్యుండాయ్ పాపులర్ హ్యాచ్ బ్యాక్ మోడల్ న్యూ‘గ్రాండ్  ఐ10’ కారు వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో న్యూ ఫ్రెష్ డిజైన్‌తో కస్టమర్ల ముందుకు రానున్నది. ఈ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ మిర్రర్ లింక్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే తదితర ఫీచర్లతోపాటు డాష్ బోర్డ్ కూడా అప్ డేట్ కానున్నది. బీఎస్ -6 ప్రమాణాలకు అనుగుణంగా 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యంలో గ్రాండ్ ఐ10 మార్కెట్లో అడుగు పెటటనున్నది. 

                                    

టాటా ఇంపాక్ట్ 2.0కు డిజైన్‌కు అనుగుణంగా ఆల్ట్రోజ్
ఈ నెలలో జెనీవాలో జరిగిన ఆటో ఎక్స్ పోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన టాటా ఆల్ట్రోజ్ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రోడ్లపైకి పరుగులు తీయనున్నది. ఆల్ఫా ప్లాట్ ఫామ్‌లో రూపుదిద్దుకున్న బ్లాక్ బర్డ్, హార్న్ బిల్ తదితర స్మార్ట్ కార్ల మాదిరిగానే టాటా ఇంపాక్ట్ 2.0 డిజైన్‌కు అనుగుణంగా ఆల్ట్రోజ్ రూపుదిద్దుకోనున్నది. వెల్ ఎక్విప్డ్ ఇంటీరియర్స్‌తోపాటు 7 - ఇంచ్ ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, లార్జ్ ఎంఐడీ, ఫ్లాట్ బాటం స్టీరింగ్ తదితర ఫీచర్లు చేర్చారు. నెక్సాన్ 1.2 లీటర్ల టర్బో చార్జిడ్ పెట్రోల్ ఇంజిన్ జత చేశారు.  

                     


మూడో త్రైమాసికంలో విపణిలోకి టయోటా బాలెనో
మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్ మధ్య ఒప్పందం మేరకు టయోటా కిర్లోస్కర్ నుంచి రూపుదిద్దుకోనున్న బాలెనో మోడల్ కారు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో విపణిలోకి రానున్నది. తొలి దశలో 25 వేల కార్లు ఉత్పత్తి కానున్నాయి. మారుతి సుజుకి రూపొందించిన బాలెనో మోడల్ కారు కంటే కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. 

                

వచ్చే ఏడాది మార్కెట్లోకి టాటా ఆల్ట్రోజ్ ఈవీ
ఇటీవలి జెనీవా ఆటో షోలో టాటా మోటార్స్ ప్రదర్శించిన ఆల్ట్రోజ్ విద్యుత్ మోడల్ హ్యాచ్ బ్యాక్ ప్రీమియం కారు వచ్చే ఏడాది మార్కెట్లో ప్రవేశించనున్నది. పర్మనెంట్ మాగ్నైట్ ఏసీ మోటర్, సింగిల్ స్పీడ్ గేర్ బాక్, 60 నిమిషాల్లో 80 శాతం చార్జింగ్ అయ్యే కెపాసిటీ గల బ్యాటరీ.. ఒక్కసారి చార్జింగ్ పూర్తయితే 250- 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం ఈ కారు సామర్థ్యం. 2020-21 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో వినియోగదారుల ముంగిట్లోకి రానున్నది.

                

click me!