ఇదీ టాటా మోటార్స్ లక్ష్యం: వాణిజ్య వాహనాల సేల్స్ గ్రోత్!

By Arun Kumar PFirst Published Oct 3, 2018, 12:40 PM IST
Highlights


టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వాణిజ్య వాహనాల విక్రయంలో 20 శాతం పురోగతి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

కోల్‌కతా: ఆటో మేజర్ టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల విక్రయాల్లో గతేడాదితో పోలిస్తే 20 శాతం ప్రగతి నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆర్థిక వ్యవస్థలో ఓవరాల్‌గా ఉన్న అప్‌ట్రెండ్‌ను సానుకూలంగా మార్చుకోవాలని తలపెట్టినట్లు ఆ సంస్థ మాన్యుఫాక్చరింగ్ విభాగం (సీవీబీయూ) ఏబీ లాల్ చెప్పారు. 
గత రెండు త్రైమాసికాల్లోనూ సంస్థ వాణిజ్య వాహనాల విక్రయాల్లో అప్ ట్రెండ్ నమోదవుతున్న నేపథ్యంలో తాము ఈ అభిప్రాయానికి వచ్చామని తెలిపారు. 
 
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టాటా మోటార్స్ ‘పుల్లీ-బిల్ట్’ వాహనాలపైనా, రవాణా వాహనాలపై ద్రుష్టి సారించిందని సంస్థ మాన్యుఫాక్చరింగ్ విభాగం అధినేత ఏబీ లాల్ తెలిపారు. ప్రస్తుతం టిప్పర్ ట్రక్స్, లోడ్ బాడీలను విక్రయిస్తోంది. ముంబై కేంద్రంగా పని చేస్తున్న సంస్థ ప్రస్తుతానికి వాహనాల ఉత్పాదక వ్యూహాన్ని ఖరారు చేసింది. 

టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల ప్లాంట్స్ యుటిలైజేషన్ సామర్థ్యం క్రమంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ జంషెడ్ పూర్ ప్లాంట్ ట్రక్ క్యాబిన్ తయారు చేస్తోంది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్ నెలలో వాణిజ్య వాహనాల విక్రయం 26 శాతం పెరిగింది. గతేడాది సెప్టెంబర్ నెలలో 36,678 వాణిజ్య వాహనాలు అమ్ముడు పోతే ఈ ఏడాది 46,169 వాహనాలను టాటా మోటార్స్ విక్రయించింది. మీడియం అండ్ హెవీ ట్రక్ సెగ్మెంట్స్ సేల్స్ 32 శాతం అమ్ముడు పోయాయి. గతేడాది 12,259 వాహనాలు విక్రయిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో 16,239 వాణిజ్య వాహనాలు అమ్ముడు పోయాయి. రవాణా వాహనాలపై సేఫ్ లిమిట్స్ 20- 25 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది.
 

click me!