పియాజియో వెస్పా 140 అని పిలవబడే ఈ కొత్త స్కూటర్ వెస్పా జిటివి ఆధారంగా రూపొందించబడింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 140 యూనిట్లు మాత్రమే విక్రయించబడుతుందని అధికారికంగా ప్రకటించారు.
ఐకానిక్ వెస్పా బైక్ పేరెంట్ కంపెనీ పియాజియో గ్రూప్ ఈ ఏడాది 140వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ గొప్ప వేడుకను మరింత ప్రత్యేకంగా చేయడానికి లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది.
పియాజియో వెస్పా 140 అని పిలవబడే ఈ కొత్త స్కూటర్ వెస్పా జిటివి ఆధారంగా రూపొందించబడింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 140 యూనిట్లు మాత్రమే విక్రయించబడుతుందని అధికారికంగా ప్రకటించారు. సెలెక్ట్ చేసిన అంతర్జాతీయ డీలర్ల వద్ద మాత్రమే ఈ మోడల్ అందుబాటులో ఉంటుందని కూడా తెలిపారు.
undefined
ఇంతకీ ఈ స్కూటర్ ప్రత్యేకత ఏమిటి?
పియాజియో వెస్పా 140 ఫ్రంట్ ఫాసియా అలాగే సైడ్ ప్యానెల్ పై వైట్ కలర్లో డార్క్ బ్లు స్ట్రిప్స్ తో ఎడమ వైపు ప్యానెల్‌కు అతికించిన '140' నంబర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ స్క్యూటర్ చాలా ప్రత్యేకమైన వాహనం కాబట్టి, ఈ బైక్‌ను చాలా జాగ్రత్తగా రూపొందించారు.
వెస్పా GTV ఆధారంగా, కొత్త బైక్ క్లాసిక్ వెస్పా లుక్ కూడా ప్రతిబింబిస్తుంది, ఫ్రంట్ మడ్‌గార్డ్-మౌంటెడ్ హెడ్‌లైట్ ఇంకా కర్వ్డ్ బాడీవర్క్‌తో ఫినిషింగ్ ఉంటుంది. ఈ స్కూటర్ 278cc, సింగిల్ సిలిండర్ ఇంజన్‌తో 24bhp, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ CVT ట్రాన్స్‌మిషన్‌తో అందించారు. ఇందులో డిజిటల్ డిస్‌ప్లే, కీలెస్ స్టార్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్ అలాగే మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.
వెస్పా 12-అంగుళాల వీల్స్ పై నడుస్తుంది, బ్రేకింగ్‌కు రెండు చివర్లలో 220mm హైడ్రాలిక్ డిస్క్‌లు సపోర్ట్నిస్తాయి. ఇటలీలో జరుగుతున్న వెస్పా వరల్డ్ డేస్ 2024 వేడుకల సందర్భంగా, పియాజియో వెస్పా 140వ స్కూటర్‌ను ఆన్‌లైన్‌లో కోనవచ్చు. అయితే దీని ధర సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పియాజియో కంపెనీ వాహనాలను 1884 నుండి ప్రపంచ మార్కెట్లో విక్రయిస్తోంది.