భారత విపణిలో ఆడీ ఏ3 ఎంట్రీతో ఐదేళ్లు.. అందుకే

By rajesh yFirst Published Jun 3, 2019, 2:27 PM IST
Highlights

ఆడి ప్రీమియం ఏ3 సెడాన్ కారు భారతదేశ విపణిలో అడుగు పెట్టి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా కొనుగోలుదారులకు రాయితీ ధరపై అందుబాటులోకి తెచ్చింది. 

ముంబై: భారత దేశ విపణిలో అడుగుపెట్టి ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘ఆడీ’ ఏ3 సెడాన్‌ కారుపై దాదాపు రూ.5లక్షల వరకు డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఆడీ ఏ3 35 టీఎఫ్‌ఎస్‌ఐ మోడల్ కారు ధర రూ.28.99 లక్షల నుంచి మొదలవుతుంది. 

దీనిపై రూ.5 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఏ3 35 టీడీఐ ప్రీమియం ధర రూ.34.93 లక్షలుగా ఉంది. ఆడీ ఏ3 కార్లలో వేరియంట్‌ను బట్టి డిస్కౌంట్‌ వర్తిస్తుంది. ఈ క్రమంలో కార్లలో ఇప్పటికే ఉన్న ఏ ఫీచర్‌ను తొలగించలేదని ఆడీ పేర్కొంది. 

ఏ3లో మొత్తం 35 టీఎఫ్ఎస్‌ఐ ప్రీమియం ప్లస్‌, 35 టీఎఫ్‌ఎస్‌ఐ టెక్నాలజీ, 35 టీడీఐ ప్రీమియం ప్లస్‌, 35 టీడీఐ టెక్నాలజీ ఉన్నాయి. 
ఇతర ఫీచర్లతోపాటు ఆడీఏ3లో అందమైన సన్‌రూఫ్‌ను అమర్చారు. 

ఫోన్‌ బాక్స్‌ విత్‌ వైర్‌లెస్‌  ఛార్జింగ్‌, డ్యుయల్‌ జోన్‌ ఏసీ కంట్రోల్‌, ఏడంగుళాల  టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ ఉన్నాయి. దీనిలో 2.0 ఫోర్‌ సిలిండర్‌ టీడీఐ డీజిల్‌ ఇంజిన్‌, 1.4 టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. 

ప్రీమియం సెడాన్ ఆడి ఏ3 కారు భారత విపనిలో అడుగు పెట్టి ఐదేళ్లు పూర్తయింది. దీన్ని తొలుత 2014లో ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది ఆడి. 2017లో ఆడి ఫేస్ లిఫ్ట్ వర్షన్ మోడల్ కారును విపణిలోకి ఆవిష్కరించింది. ప్రస్తుతం ఆడి మోడల్ కారు నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉన్నది.  

1.4 లీటర్ల టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ గల కారు 7 - స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్‌తోపాటు 150 హెచ్పీ, 250 ఎన్ఎం టార్చి శక్తిని అందిస్తుంది. 2.0 లీటర్ల 4 సిలిండర్ డీజిల్ ఇంజిన్ కారులో 143 హెచ్పీ పవర్, 320 ఎన్ఎం టార్చి ప్లస్ 6 -స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కలిగి ఉంది. ఫ్యూయల్ అఫిసన్ గ్యాసోలైన్ కారు 19.2 లీటర్లు, డీజిల్ ఇంజిన్ 20.39 కి.మీ. మైలేజీనిస్తోంది. దీంతోపాటు మెర్సిడెజ్ బెంచ్ సీఎల్ఎ క్లాస్ మోడల్ కారుతో పోటీ పడుతోంది.

click me!