స్ట్రాటర్జీ రివైజ్: హాఫ్ డజన్ ‘ఎస్‌యూవీ’ల తయారీకి నిస్సాన్ రెడీ

By Arun Kumar PFirst Published Oct 23, 2018, 12:21 PM IST
Highlights

సాధారణ మోడల్ కార్లతో భారతీయులను ఆకట్టుకోలేకపోయిన నిస్సాన్ ఇండియా.. మార్కెట్‌లోకి ఎస్ యూవీ మోడల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసి, . త్వరలో కనీసం ఆరు ఎస్‌యూవీ మోడల్ కార్లను తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. తద్వారా మార్కెట్ వాటా పెంచుకోవాలని తపన పడుతున్నది.

న్యూఢిల్లీ: భారతీయ మార్కెట్‌లో రికార్డులు నెలకొల్పడంలో విఫలమైంది జపానీస్ కార్ల మేజర్ నిస్సాన్. కానీ ఎలాగైనా భారతదేశం మార్కెట్‌లోకి హాఫ్ డజన్ ఎస్‌యూవీ కార్లను ఆవిష్కరించాలని లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తద్వారా హ్యుండాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఫోర్డ్ తదితర ప్రత్యర్థి సంస్థలతో తలపడేందుకు సిద్ధమవుతోంది. 

2010లో భారతదేశ మార్కెట్‌లో అడుగు పెట్టిన నిస్సాన్.. కార్ల ప్రియులను ఆకట్టుకోలేకపోయింది. కానీ విదేశాలకు కార్లను ఎగుమతి చేయడానికి ప్రాధాన్యం ఇస్తోంది అంతేకాదు ఒకింత విజయం సాధించింది కూడా. భారతీయ కార్ల వినియోగదారులంతా ఎస్ యూవీ మోడల్ కార్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ యూవీ మోడల్ కార్ల తయారీ కోసం తన వ్యూహాన్ని పున:రూపొందించామని నిస్సాన్ ఇండియా అధ్యక్షుడు థామస్ కౌహ్ల్ తెలిపారు. 

దేశీయంగా గత ఆర్థిక సంవత్సరంలో 1.5 శాతానికి లోపే కార్ల విక్రయాలు జరిపింది. దేశీయంగా నిస్సాన్ సేల్స్ కేవలం 53 వేలు మాత్రమే. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి కిక్స్ అనే మోడల్ ఎస్ యూ వీ కారుతో శుభారంభాన్ని అందుకోవాలని తలపోస్తోంది. తద్వారా హ్యుండాయ్ క్రెటా, రెనాల్డ్ డస్టర్, మహీంద్రా స్కార్పియో మోడల్ కార్లతో గట్టిగా పోటీ పడుతోంది. కిక్స్ మోడల్ ఎస్ యూవీ కారు 2500 యూనిట్లు విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నది. తర్వాత పాథ్ ఫైండర్, టెర్రా, ఎక్స్ ట్రయల్ మోడల్ కార్లు కూడా మార్కెట్లోకి తేవాలని నిస్సాన్ భావిస్తోంది. 
 

click me!