హ్యుండాయ్‌కు సవాల్: మార్కెట్లోకి మారుతి ‘వాగన్ ఆర్’

By narsimha lodeFirst Published 9, Sep 2018, 3:46 PM IST
Highlights

 దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ వచ్చేడాది తన ప్రతిష్థాత్మక మోడల్ కారు అత్యాధునిక ‘వాగన్ ఆర్’ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ వచ్చేడాది తన ప్రతిష్థాత్మక మోడల్ కారు అత్యాధునిక ‘వాగన్ ఆర్’ను మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది. ఇది ప్రత్యర్థి సంస్థ ‘హ్యుండాయ్ శాంత్రో’ త్వరలో విడుదల చేయనున్న కొత్త మోడల్‌కు సవాల్ విసరనున్నది. 

మారుతి సుజుకి ప్రతినెలా అత్యధికంగా అమ్ముడు పోతున్న ‘వాగన్ ఆర్’ యూనిట్లు 14 వేలు ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ మోడల్ కారును మారుతి సుజుకి మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది. ఇంతకుముందే జపాన్ మార్కెట్‌లో‌కి విడుదల చేసింది. కై కారు క్యాటగిరీలో గల ఈ కార్ ఇంజిన్ సామర్థ్యం 660 సీసీ. 

భారతదేశంలో విడుదల చేసే నూతన వాగన్ ఆర్ మోడల్ కారులో ఒక లీటర్ కే 10 ఇంజిన్ ఉంటుంది. ఇది ఆల్టో కే 10, సెలెరియో మోడల్ కార్ల మాదిరిగా వాగన్ ఆర్ మోడల్ కారు పని చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న సీఎన్జీ వర్షన్ వాగన్ ఆర్ కారు స్థానే మార్కెట్ లోకి రానున్న వాగన్ ఆర్ కారులో ఆల్టర్నేటివ్ ఇంధన వసతి లభిస్తుందా? లేదా? అన్న సంగతి ధ్రువీకరణ కాలేదు.

గతవారమే మారుతి సుజుకి వాగన్ ఆర్ 12వ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నది. కొన్ని లక్షల కార్లను విక్రయించింది. భారతదేశంతోపాటు పశ్చిమ యూరప్ దేశాల్లోనూ వినియోగదారులు దీనికి ప్రజాదరణ లభించింది. విద్యుత్ వినియోగంతో నడిపే నూతన మోడల్ వాగన్ ఆర్ కారును 2020 నాటికి మార్కెట్ లోకి తీసుకొస్తారని అంచనా వేస్తున్నారు. 

నూతన మారుతి సుజుకి వాగన్ ఆర్ తన ప్రత్యర్థి హ్యుండాయ్ సాంత్రో, హ్యుండాయ్ ఏహెచ్2 మోడల్ కార్లు, టాటా టియాగో మోడల్ కార్లకు కూడా సవాల్ విసరనున్నది. ప్రత్యేకించి కొన్నేళ్ల క్రితం మార్కెట్ లోకి రంగ ప్రవేశం చేసిన టాటా టియాగో కారుకు నూతన మారుతి సుజుకి వాగన్ నిజమైన సరిజోడిగా సవాల్ విసరనున్నదని అంచనా వేస్తున్నారు. ఇందులో ఏబీఎస్, ఎయిర్ బ్యాగ్ లు, ఇన్ఫోటైన్మెంట్ సెటప్, టస్ స్క్ర్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, డే టైం రన్నింగ్ లైట్స్ తదితరాలు అదనపు ఆకర్షణ కానున్నాయి. 

Last Updated 9, Sep 2018, 3:46 PM IST