పాలసీ లేకున్నా నో ప్రాబ్లం.. విద్యుత్ వెహికల్స్‌పై కియా

By rajesh yFirst Published Dec 10, 2018, 11:54 AM IST
Highlights


దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ విద్యుత్ వాహనాల విషయమై భారత ప్రభుత్వం ఇప్పటికిప్పుడు విధాన నిర్ణయం రూపొందించక పోయినా నష్టం లేదని చెబుతోంది. పర్యావరణ హితమైన వాహనాల కోసం భారతదేశం త్వరిగతిన ఆధునాతన పద్దతులను అలవర్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నదంటోంది. 

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ విద్యుత్ వాహనాల విషయమై భారత ప్రభుత్వం ఇప్పటికిప్పుడు విధాన నిర్ణయం రూపొందించక పోయినా నష్టం లేదని చెబుతోంది. పర్యావరణ హితమైన వాహనాల కోసం భారతదేశం త్వరిగతిన ఆధునాతన పద్దతులను అలవర్చుకునే సామర్థ్యం కలిగి ఉన్నదంటోంది. 

స్థానిక మార్కెట్ కోసం ప్రస్తుతం అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న పోర్ట్ ఫోలియోనూ అందుకోగలదని కియా మోటార్స్ అంచనా.  అయితే భారత ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాల సారథ్యంలోని పర్యావరణ హితమైన టెక్నాలజీ వైపు ప్రజలను, పరిశ్రమలను దారి మళ్లించాల్సి ఉంటుందని కియా మోటార్స్ భావిస్తోంది. 

2021 నాటికి భారతదేశంలో విద్యుత్ వాహనాలను రోడ్లపైకి తీసుకు రానున్నది. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురంలో ఒక ప్లాంట్ ఉత్పత్తి కోసం చర్యలు చేపట్టింది. కియా మోటార్స్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ కుక్ హ్యూన్ షిమ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో భారత ప్రభుత్వం వద్ద ఎటువంటి విధానాల్లేవు, ఆ దిశగా అంతర్జాతీయంగా భారీ స్థాయిలో మార్గదర్శనం చేస్తోందని చెప్పారు. 

ఈ క్రమంలో తమ సంస్థ ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ సాయంతో పవర్ ట్రైన్ ఆఫ్ ఇంటర్నల్ కంబుష్టన్ ఇంజిన్లను రీప్లేస్ చేసే దిశగా ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలపై విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తే నియంత్రణ నిబంధనలు, వినియోగదారుల అవసరాలకు అనుగునంగా తామూ విద్యుత్ ఆధారిత వాహనాలను వాడేందుకు సిద్ధమని కియా మోటార్స్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ కుక్ హ్యూన్ షిమ్ చెప్పారు. 

అంతర్జాతీయంగా తమ సంస్థ ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ అభివ్రుద్ధికి రీసెర్చిపై ద్రుష్టి సారిస్తోందని కియా మోటార్స్ ఇండియా సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్ కుక్ హ్యూన్ షిమ్ చెప్పారు. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లో 48 ఓల్టుల సామర్థ్యం గల మైల్డ్ హైబ్రీడ్ ఉత్పత్తిని మార్కెట్లో అందుబాటులోకి తెచ్చామన్నారు. 

అంతర్జాతీయ వ్యూహంలో భాగంగానే భారత విద్యుత్ వాహనాల తయారీ వాడకంపై కేంద్ర ప్రభుత్వం కూడా విధానాన్ని రూపొందిస్తుందని షిమ్ అంచనా వేశారు. దేశీయంగా ఎటువంటి టెక్నాలజీ లేకున్నా, అంతర్జాతీయ వ్యూహాన్ని త్వరితగతిన అంది పుచ్చుకునే సామర్థ్యం తమకు ఉన్నదని షిమ్ చెప్పారు. 

గతవారమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ‘పార్టనర్ షిప్ ఫర్ ఫ్యూచర్ ఎకో మొబిలిటీ’ అనే అంశంపై అవగాహనాఒప్పందంపై కియా మోటార్స్ ప్రతినిధులు సంతకాలు చేశారు.  దీని ప్రకారం నిరో హైబ్రిడ్, నీరో ప్లగ్ తదితర టెక్నాలజీ టూల్స్ ను కియా మోటార్స్ భారతదేశానికి పరిచయం చేయనున్నది. 
 

click me!