అద్భుతం! వరదలో పడవగా మారిన కారు.. వైరల్ వీడియో..

By Ashok kumar SandraFirst Published Apr 18, 2024, 3:41 PM IST
Highlights

వర్ష బీభత్సానికి ఎడారి దేశం దుబాయ్‌ విలవిలలాడిపోతోంది. భారీ వర్షానికి తోడు వేగంగా వీచిన ఈదురు గాలులకు చెట్లు నేల కూలాయి. కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. కానీ ఓ కారు మాత్రం పడవలా నీటిలో తెలుతూ.. పరుగులు తీసింది. ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కారుంటే?  ఆ కారు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. .. 

 దుబాయ్‌ వర్ష బీభత్సానికి విలవిలలాడిపోతోంది. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకరోజులోనే కురిసింది. భారీ వర్షానికి తోడు వేగంగా వీచిన ఈదురు గాలులకు చెట్లు నేల కూలాయి. కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. మాల్స్ అన్నీ నీటమునిగాయి. అలాగే.. విమాన సర్వీసులు నిలిచిపోయాయి.దీంతో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లన్ని జలమయం అయినా.. ఓ కారు మాత్రం పడవలా నీటిలో తిరుగుతుంది.  ఈ  కారుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కారుంటే?  ఆ కారు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం. .. 
 
దుబాయిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రధాన వీధులు నీటముగాయి. గత 75 ఏళ్లలో ఎప్పుడూ  ఇంతటి భారీ వర్షాలు కురియలేదని అధికారులు తెలిపారు. రోడ్లపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.కానీ, టెస్లా మోడల్ వై కారు(Tesla Model Y) మాత్రం వరద నీటిలో పడవలా పరుగులు దీస్తుంది. ఈ కారులో బోట్ మోడ్‌ ఉంటుంది.

 టెస్లా కారు నీటిలో పరుగెత్తడం ఇదే మొదటిసారి కాదు. టెస్లా తన కార్లను లోతైన నీటిలో కూడా పరీక్షించింది. చైనాలో వస్తున్న తుఫానుల దృష్ట్యా టెస్లా మోడల్ 3, మోడల్ Y లను నీటి అడుగున పరీక్షించింది టెస్లా. అయితే.. ఈవీ కార్లను నీటిలోకి తీసుకెళ్తే ప్రమాదం జరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ  కారుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

దుబాయ్‌లో  24 గంటల పాటు భారీ వర్షం కురిసింది. సోమవారం రాత్రి ప్రారంభమైన వర్షం మంగళవారం  వరకు కురిసింది. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం 142 m.m కంటే ఎక్కువ వర్షం కురిసింది. నగరంలో ఏటా దాదాపు 94.7  m.m వర్షపాతం నమోదవుతుంది.  

 

Tesla boat-mode 😯 pic.twitter.com/AGgHzxzEt5

— Faiza Anum (@FaizaStories)
click me!