వచ్చేనెల నుంచి హోండా కార్లు ప్రియం!

By rajesh yFirst Published Jun 17, 2019, 11:22 AM IST
Highlights


పెరిగిన ముడి సరుకు ధరలు, అదనపు భద్రతా ఫీచర్లు జత చేర్చడంతో తమపై పెరిగిన భారాన్ని వినియోగదారులపై కొంత మోపడానికి సిద్ధమైనట్లు హోండా కార్స్ ప్రకటించింది. వచ్చేనెల నుంచి అన్ని రకాల కార్లపై 1.2 శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఒకే ఏడాదిలో హోండా కార్స్ కార్ల ధర పెంచడం రెండోసారి కానుంది. 

న్యూఢిల్లీ: వచ్చే నెల నుంచి కార్ల ధరలను 1.2 శాతం వరకు పెంచేందుకు హోండా కార్స్‌ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ముడి వస్తువుల ధరలు పెరగడం, కార్లలో కొత్త భద్రతా ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే ఇందుకు కారణమని కంపెనీ  సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, డైరెక్టర్‌ రాజేశ్‌ గోయల్‌ పేర్కొన్నారు. గత కొన్ని నెలల్లో ముడివస్తువుల ధరలు భారీగా పెరిగాయని, వీటిని కంపెనీయే భరిస్తోందని అన్నారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులపై కొంత భారం వేయక తప్పడం లేదని  సేల్స్ అండ్ మార్కెటింగ్ పేర్కొన్నారు. ప్రస్తుతం కంపెనీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ బ్రియో నుంచి ప్రీమియం సెడాన్‌ అకార్డ్‌ హైబ్రిడ్‌ శ్రేణిలో మోడళ్లను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.4.73- 43.21 లక్షలుగా ఉన్నాయి. ఈ ఏడాదిలో కంపెనీ ధరలను పెంచడం ఇది రెండోసారి కానుంది. 

కొన్ని నెలలుగా ముడి సరుకుల ధరలు భగ్గుమనడంతో సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని వినియోగదారులకు మళ్లించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ధరలు పెంచడం ఇది రెండోసారి కానున్నది. ఇప్పటికే ఫిబ్రవరిలో అన్ని మోడళ్లపై రూ.10,000 వరకు ధరలు పెంచిన విషయం తెలిసిందే. జనవరిలోనే మారుతి సుజుకీ, టయోటా కిర్లోస్కర్, ఇసుజు కూడా తమ వాహన ధరలను పెంచాయి.
 

click me!