జనరల్ మోటార్స్ లేఆఫ్స్: 4000 మందిపై వేటు

By narsimha lodeFirst Published Feb 3, 2019, 11:00 AM IST
Highlights

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్(జీఎం) భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేసింది. గత ఏడాదిలో ఏకంగా 4 వేల మంది సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తున్నది.

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జనరల్ మోటార్స్(జీఎం) భారీ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేసింది. గత ఏడాదిలో ఏకంగా 4 వేల మంది సిబ్బందిని తొలగించినట్లు తెలుస్తున్నది. నిర్వహణ ఖర్చులను తగ్గించుకోనున్నట్లు గత నవంబర్‌లో సంస్థ ప్రకటనకు అనుగుణంగా మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం మందిపై వేటు వేయనున్నట్లు గతంలోనే సంకేతాలిచ్చింది. 

ఇతర సంస్థల నుంచి పోటీ తీవ్రతరమవడం, కంపెనీకి చెందిన వాహనాలకు అంతగా డిమాండ్ లేకపోవడంతో ఏకంగా ఏడు ప్లాంట్లను జనరల్ మోటార్స్ మూసివేసింది. వీటిలో ఉత్తర అమెరికాలో ఐదు ఉన్నాయి. వీటిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించింది. 

ఇప్పటి వరకు తొలగించిన వారి ఉద్యోగుల సంఖ్య 14 వేల వరకు ఉంది.  వీరిలో 6 వేల మంది పలు కార్మిక సంఘాలకు చెందిన వారు. అమెరికా, కెనడా దేశాలకు చెందిన రాజకీయ నాయకుల వల్ల సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదని, ముఖ్యంగా వీరి కారణంగా 600 కోట్ల డాలర్ల మేర నష్టపోవాల్సి వచ్చిందని జనరల్ మోటార్స్ యాజమాన్యం వాపోతున్నది. 

సర్వీసుల నుంచి ఎంతమందిని తొలగించిన దానిపై జనరల్ మోటార్స్ వర్గాలు స్పందించడానికి నిరాకరించాయి. అలాగే 2,300 మంది వేతన జీవులు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలని నిర్ణయం తీసుకున్నారని, మరో 1,500 మంది కాంట్రాక్టు స్టాఫ్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.
 

click me!