హైదరాబాద్ లో మొట్టమొదటి ఎలక్ట్రికల్ చార్జింగ్ బంక్ ప్రారంభం

First Published 2, Aug 2018, 4:56 PM IST
Highlights

ప్రస్తుతం పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. అంతే కాకుండా ఈ కాలుష్య ఉద్గారాల వల్ల పర్యావరణానికి కూడా హాని కల్గుతోంది. ఈ రెండింటికి ఒకేసారి పరిష్కారం చూపెట్టడానికి మార్కెట్లోకి వస్తున్నవే ఎలక్టిక్ వాహనాలు. వీటివల్ల అటు వినియోగదారుడిపై భారం తగ్గడంతో పాటు పర్యావరణానికి నష్టం జరగదు. దీంతో మార్కెట్లో ఇప్పుడు వీటికి మంచి గిరాకీ పెరుగుతోంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా ఓ ఎలక్ట్రికల్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటయింది.  హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్‌  లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)సంస్థ రాయదుర్గంలో మిస్సెస్‌ దినేష్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ పేరుతో ఓ రిచార్జ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. గ్రీన్ టెక్నాలజీని ప్రోత్సహించి కార్బన్ డై ఆక్సైడ్ ను తగ్గించడంలో తమ వంతు పాత్రగా ఈ ఎలక్ట్రికల్ రీచార్జ్ బంకు ను ఏర్పాటు చేసినట్లు హెచ్‌సిఎల్ సంస్థ తెలిపింది.   వీటిని త్వరలో తెలంగాణ వ్యాప్తంగా వున్న అన్ని నగరాల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఈ సంస్థ పేర్కొంది. 

పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వినియోగదారులను ప్రోత్సహిస్తోంది. అందుకోసం ఈ ఎలక్ట్రిక్ చార్జింగ్ బంకుల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రత్యేక మినహాయింపులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ రంగంలో మరిన్ని మౌళిక సదుపాయాలు కల్పించి అత్యధికంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరిగేలా చూస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Last Updated 2, Aug 2018, 4:56 PM IST