అడ్వెంచర్ల రైడింగ్... అదిరిపోయే ఫీచెర్లతో 'కవాసాకీ వెర్‌స్యేస్'

By rajesh yFirst Published Feb 13, 2019, 1:43 PM IST
Highlights

సాహస వంతులు దేశవ్యాప్తంగా పర్యటించడానికి వీలుగా కవాసాకీ మోటార్స్ ఇండియా నూతన మోడల్ బైక్ వెర్‌స్యేస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర మార్కెట్లో రూ.10.69 లక్షలుగా నిర్ణయించారు.

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ‘కవాసాకీ’ భారత్ మార్కెట్లోకి నూతన మోడల్ బైక్ ‘వెర్‌స్యెస్ 1000’ను విడుదల చేసింది. దాని ధర రూ.10.69 లక్షలుగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా సాహస యాత్రలు చేసే వారికి అత్యంత చౌకగా అందుబాటులో ఉన్న బైక్ ఇది. 

గతేడాది నవంబర్ నెలలో రూ.1.50 లక్షలకు బుకింగ్స్ మొదలయ్యాయి. ప్రీ బుకింగ్స్ నమోదు చేసుకున్న వినియోగదారులకు వచ్చేనెల నుంచి కవాసాకి ఇండియా డెలివరీ చేయనున్నది. గతేడాది తొలిసారి ‘ఈఐసీఎంఏ’ ఎక్స్ పోలో తొలుత ప్రదర్శించిన వెర్‌స్యేస్ బైక్ భారతదేశ మార్కెట్లో పెరల్ మెటాలిక్, మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ కలర్‌లో లభిస్తుంది. 
కవాసాకీ వెర్‌స్యేస్ 1000 సీసీ మోడల్ బైక్..గత బైకులకు అప్ డేట్ వర్షన్‌గా నిలువనున్నది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన నింజా మోడల్ బైక్ స్ఫూర్తిగా రూపుదిద్దుకున్నది కవాసాకీ వెర్‌స్యేస్. 

అడ్జస్టబుల్ వైండ్ స్క్రీన్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ తదితర ఫీచర్లు కవాసాకీ వెర్‌స్యేస్ 1000 బైక్ లో అదనపు ఆకర్షణ కానున్నాయి. కవాసాకీ ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. 

కవాసాకీ వెర్‌స్యేస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా గల కవాసాకీ వెర్‌స్యేస్ 1043 ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ సామర్థ్యం కూడా ఉంది. కవాసాకీ వెర్‌స్యేస్ 1000 సీసీ సామర్థ్యం గల బైక్ 9000 ఆర్పీఎం వద్ద 120 బీహెచ్పీని, 7500 ఆర్పీఎం వద్ద 102 ఎన్ఎం విడుదల చేస్తోంది. 

కవాసాకీ వెర్‌స్యేస్ అదనంగా సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ కూడా కలిగి ఉన్నది. 255 కిలోల బరువు గల ఈ బైక్ సాహసవంతులు రైడ్ చేయడానికి వీలుగా 17 అంగుళాల వీల్స్, 21 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ కూడా అమర్చారు. సీకేడీ కిట్ మినహా కవాసాకీ వెర్‌స్యేస్ 1000 బైక్ భారత్ లోనే తయారైంది. ఇది డుకాటీ మల్టీ స్ట్రాడా 950 మోడల్ బైక్‌తో పోటీ పడనున్నది. 

click me!