న్యూ ఇయర్ లో మీనరాశివారి రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Jan 1, 2019, 10:42 AM IST
Highlights

ఈ నూతన సంవత్సరంలో మీనరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : లగ్న థమాధిపతి గురుడు నవమంలోనూ, లాభ వ్యయాధిపతి శని థమంలోనూ, పంచమంలో రాహువు, దశమంలో  కేతువు ఉన్నారు. మార్చ్‌ తర్వాత చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు ఉంటారు.

వీరికి వృత్తి ఉద్యోగాదుల్లో పదోన్నతి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధికారులతో అనుకూలత ఉంటుంది. చేసే అన్ని పనుల్లోనూ సంతృప్తి లభిస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచన కూడా పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయంగా ఉంటుంది. పరిశోధనలు చేసుకునే ప్రయత్నం చేయవచ్చు.  మొదలు పెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కొంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ  అంతగా అనిపించదు.

లాభాలు ఆశించినంతగా ఉండవు. వచ్చిన లాభాలు కూడా సంతృప్తిని ఇవ్వలేవు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. సౌకర్యాల వల్ల ఒత్తిడి బాగా పెరుగుతుంది. కళాకారులకు కూడా కొంత శ్రమ, ఒత్తిడి ఉంటాయి. గౌరవభంగాలు జరిగే సూచనలున్నాయి. ఎవరితోనూ ఎక్కువగా కలవకపోవడం మంచిది. ఏవో ఊహలు ఆశయాలు పెట్టుకోకూడదు.

సంతాన ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత కరువౌవుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన సమర్ధత తక్కువగా ఉంటుంది. తాను అనుకున్నది ఒకి అక్కడ జరిగేది మరో రకంగా ఉంటుంది. మార్చి తర్వాత నుంచి సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. వాటి పై దృష్టి చాలా పెరుగుతుంది. కాని వాటి  జోలికి వెళ్ళకూడదు. తాను సుఖపడాలనే ఆలోచనను తగ్గించుకోవాలి.

లాభాలు ఒత్తిడిని కలిగిస్తాయి. వచ్చిన లాభాల్లో సంతృప్తి ఉండదు. నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. కళాకారులకు అంత అనుకూలం కాదు. తమకు ఏమీ రాదనే నిరాశ ధోరణినుంచి బయికి రావాలి. ఆశను పెంచుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి. మార్చి తర్వాత నుంచి అధికారులతో, వృత్తి ఉద్యోగాదుల్లో సంఘంలో గౌరవం కూడా కోల్పోయే సూచనలు ఉన్నాయి. అహంకారం తగ్గించుకోవాలి.

వీరు పవుపక్షాదులకు ఆహారం వేయడం, నీరు పెట్టడం, యోగా ప్రాణాయామాలు చేయడం, వాకింగ్‌ చేయడం అలవాటు చేసుకోవాలి. గురువులను సత్కరించుకోవాలి. విద్యార్థులకు పుస్తకాలు పంచిప్టోలి. శనగలు, దానం చేయాలి.  పసుపురంగు, నీలిరంగు, చిత్రవర్ణం వస్త్రాలను దానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

ఇతర రాశుల వివరాలు ఇక్కడ చదవండి

నూతన సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందంటే...

నూతన సంవత్సరంలో వృషభరాశి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

న్యూ ఇయర్ లో మిథునరాశి వారి రాశిఫలాలు ఇలా ఉన్నాయి

నూతన సంవత్సరంలో కర్కాటక రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో సింహరాశి వారి రాశిఫలాలు

న్యూ ఇయర్ లో కన్య రాశివారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో తులరాశి వారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో వృశ్చిక రాశివారి రాశిఫలాలు

న్యూ ఇయర్ లో మకరరాశి వారి రాశిఫలాలు

నూతన సంవత్సరంలో కుంభరాశి వారి రాశిఫలాలు

click me!