ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 23.03.2025 ఆదివారానికి సంబంధించినవి.
వృత్తి, వ్యాపారాల్లో ఊహించని సమస్యలు వస్తాయి. వృథా ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల విశ్రాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే.
ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు అనుకూలం. అవసరానికి డబ్బు సహాయం అందుతుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి.
ఆర్థిక ఒడిదుడుకులు చికాకు తెప్పిస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారాల్లో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. వృథా ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు.
వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా ఆశాజనకం. ముఖ్యమైన విషయాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం దక్కుతుంది. బంధువులతో వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అనుకూలం. వృత్తి, వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలను అధిగమిస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. భూ క్రయ విక్రయాలు లాభదాయకం.
ఇంట్లో గందరగోళంగా ఉంటుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆర్థికంగా నిరాశ తప్పదు. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.
నిరుద్యోగులకు అనుకూలం. వ్యాపార ప్రయత్నాలు కలిసివస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు అనుకూలం.
దూర ప్రయాణాలు కలిసివస్తాయి. వివాదాలకు సంభందించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అన్నదమ్ములతో చిన్నపాటి గొడవలు వస్తాయి.
వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పనిభారం తప్పదు. చేపట్టిన పనులు కష్టం మీద పూర్తిచేస్తారు. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుస్తారు.
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మంచిది. విందు వినోదాల్లో పాల్గొంటారు.