సాధారణంగా మనం పర్సులో డబ్బులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఫోటోల లాంటివి పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఫెంగ్ షుయి చిట్కాల ప్రకారం పుట్టిన తేదీని బట్టి పర్సులో కొన్ని వస్తువులు పెట్టుకోవడం ద్వారా డబ్బుకు లోటు లేకుండా ఉంటుందట. మరి ఏ తేదీలో పుట్టినవారు పర్సులో ఏ వస్తువు పెట్టుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఖరీదైన ప్రపంచంలో డబ్బు ఎంత ఉన్నా సరిపోదు. లక్షలు సంపాదించే వ్యక్తి కూడా ఒక్కోసారి నెలాఖర్లో ఖాళీ చేతులతో నిలబడాల్సి వస్తుంది. డబ్బు ఎంత కష్టపడి సంపాదిస్తారో.. అంతే జాగ్రత్తగా వాడుకోవడం ముఖ్యం. కానీ చాలాసార్లు డబ్బు వృథాగా ఖర్చు అవుతుంటుంది. ఫెంగ్ షుయి ప్రకారం వృథా ఖర్చులు తగ్గి.. మీ పర్సులో ఎప్పుడూ డబ్బు ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.
సంపదను పొందడానికి వివధ దేశాల్లో వివిధ రకాల పద్ధతులు పాటిస్తుంటారు. అలా చైనా ప్రజలు పాటించేవే ఫెంగ్ షుయ్ చిట్కాలు. ఇది ఒక పురాతన చైనీస్ సంప్రదాయం. ఫెంగ్ షుయి ప్రకారం పర్సులో ఏది పడితే అది పెట్టుకోవడం వల్ల నష్టాలు వస్తాయట. పుట్టిన తేదీ, మూల సంఖ్య ప్రకారం మీ పర్సులో కొన్ని వస్తువులు పెట్టుకోవాలట. అవెంటో ఇప్పుడు చూద్దాం.
మూల సంఖ్య 1:
పుట్టిన తేదీ ద్వారా మీ మూల సంఖ్యను తెలుసుకోవచ్చు. మీ పుట్టిన సంఖ్య ఒకటి అయితే సూర్యకాంతిని సూచించే రాగి నాణేన్ని పర్సులో పెట్టుకోండి. నాణేన్ని పర్సులో పెడితే విజయం, శ్రేయస్సు, గౌరవం పెరుగుతాయి. కొద్ది రోజుల్లోనే మీకు దాని ఫలితం కనిపిస్తుంది.
మూల సంఖ్య 2:
మీ జన్మ సంఖ్య 2 అయితే మీరు వెండి నాణేన్ని పెట్టుకోవాలి. చదరం లేదా దీర్ఘచతురస్రాకారపు వెండి నాణేన్ని పెట్టుకోవాలి. ఇది శాంతికి చిహ్నం.
మూల సంఖ్య 3:
మీ మూల సంఖ్య 3 అయితే కుంకుమ పువ్వును పర్సులో పెట్టుకోవడం మంచిది. కుంకుమ పువ్వు గురు గ్రహానికి సంబంధించింది. ఇది మీ అభివృద్ధిని ప్రోత్సాహిస్తుంది. కొద్దిగా కుంకుమ పువ్వును పసుపు రంగు పేపర్‌లో చుట్టి పర్సులో పెట్టుకోవాలి.
మూల సంఖ్య 4:
వీరు బార్లీని పర్సులో పెట్టుకుంటే మంచిది. బార్లీని ఆకుపచ్చని వస్త్రంలో చుట్టి పెట్టుకోవడం వల్ల రాహు దోషం తగ్గుతుంది.
మూల సంఖ్య 5:
మీ మూల సంఖ్య 5 అయితే తులసి ఆకును పర్సులో పెట్టుకోండి. ఇది త్వరగా ఎండిపోతుంది కాబట్టి మారుస్తూ ఉండాలి. తులసి బుధ గ్రహానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇది తెలివితేటలు, సున్నితత్వాన్ని పెంచుతుంది.
పుట్టిన తేదీ 6:
గులాబీ శుక్ర గ్రహానికి సంబంధించింది. మీ జన్మ తేదీ 6 అయితే ఎండిన గులాబీని పర్సులో పెట్టుకోండి. ఒకవేళ గులాబీ దొరకకపోతే మెరిసే వస్త్రాన్ని పెట్టుకోవచ్చు.
మూల సంఖ్య 7:
మీ మూల సంఖ్య 7 అయితే మీకు ఇష్టమైన వారి ఫోటోను పర్సులో పెట్టుకోవాలి. భర్త, పిల్లలు లేదా మీకు నచ్చిన వారి ఫోటో పెట్టుకోవచ్చు. ఇది మీ జాతకంలో ఉన్న కేతువు శక్తిని తగ్గిస్తుంది.
మూల సంఖ్య 8:
వీరు ఏదైనా అదృష్ట నాణేన్ని పర్సులో పెట్టుకోవచ్చు. కానీ ఆ నాణెం దేవాలయానికి సంబంధించిందై ఉండాలి. ఇది వృత్తి, ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుంది.
మూల సంఖ్య 9:
మూల సంఖ్య తొమ్మిది అయితే ఎరుపు దారం మంచిది. దాన్ని పర్సులో పెట్టుకోవడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది. కానీ ఎరుపు దారాన్ని పర్సులో పెట్టే ముందు 9 ముడులు వేయాలి.