ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 22.03.2025 శనివారానికి సంబంధించినవి.
వృత్తి, వ్యాపారాలు అనుకూలం. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ధన లాభం కలుగవచ్చు. బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు.
ప్రయాణాల్లో అవరోధాలు వస్తాయి. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు సాధారణం. ఉద్యోగులు అధికారుల కోపానికి గురవుతారు. కొన్ని సమస్యలు చికాకు తెప్పిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
మిత్రుల సాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
వ్యాపారాలు లాభదాయకం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. ఉద్యోగులు ప్రశంసలు అందుకుంటారు. ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు అనుకూలం.
ఉద్యోగంలో సమస్యలు తప్పవు. ముఖ్యమైన విషయాల్లో సొంత ఆలోచనలు పనికిరావు. వ్యాపారాలు సాధారణం. బంధువులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి.
నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. స్థిరాస్తి ఒప్పందాల్లో అవాంతరాలు వస్తాయి. ఉద్యోగులకు తోటివారితో మాటపట్టింపులు వస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు వస్తాయి.
చిన్ననాటి మిత్రులతో విందు వినాదాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటుండదు. వృత్తి, వ్యాపారాలు చాలా అనుకూలం. అన్నదమ్ములతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి.
వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగులు సాలరీ విషయంలో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. శుభకార్యలకు ఆహ్వానాలు అందుతాయి.
కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు వస్తాయి. వ్యాపారాలు నిరుత్సాహంగా సాగుతాయి. ముఖ్యమైన పనులు మందగిస్తాయి. నిరుద్యోగులకు అనుకూలం కాదు. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చికాకు తెప్పిస్తాయి.
వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు వస్తాయి. డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తి విషయాల్లో తొందరపాటు పనికిరాదు.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో సమస్యలు అధిగమిస్తారు. కీలక విషయాలు తెలుస్తాయి. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. పిల్లల చదువు, ఉద్యోగం విషయాలు సంతోషాన్నిస్తాయి.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికంగా నిరాశ ఎదురవుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. వ్యాపారాల్లో చిన్నపాటి గొడవలు వస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. కొత్త కార్యక్రమాల ప్రారంభానికి ఆటంకాలు వస్తాయి.