ధనస్సు రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

By ramya neerukondaFirst Published Aug 31, 2018, 4:41 PM IST
Highlights

మొండితనంతో మొదలు పెట్టిన పనిని పూర్తి చేసేవరకు వదలరు. తాము వెనకాల ఉంటూ సమాజాన్ని ముందుగు నడిపించే తత్త్వం కలవారు.

కాంతివంతమైన కళ్ళు, పొడవైన ముక్కు, ఎత్తైన పొడవైన కనుబొమ్మలు, వెడల్పైన ముఖం, చక్కని అవయవ సౌష్ఠవంతో అందమైన దేహాన్ని కలిగి ఉంటారు. నూతన విషయాలు తెలుసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వాక్‌ చాతుర్యం ఉంటుంది. సమాజం ఎక్కువగా ఆలోచిస్తారు. సమాజానికి ఉపయోగపడే పనులు చేయడంకోసం ముందడుగు వేస్తారు. చేసే పనిలో లక్ష్యసాధన ఉంటుంది. ఆ పనిని లోతులకు వెళ్ళి పరిశీలించి మంచిని ప్రోత్సహిస్తూ చెడును నిర్మూలించడానికి సరియైన ప్రణాళిక వేస్తారు. కూర్చుండి పని చేయడం, తిరిగి చేయడం రెండూ ఇష్టమైనవే. మొండితనంతో మొదలు పెట్టిన పనిని పూర్తి చేసేవరకు వదలరు. తాము వెనకాల ఉంటూ సమాజాన్ని ముందుగు నడిపించే తత్త్వం కలవారు. అన్నింటిలో తామే బయటపడాలి తమకే పేరు రావాలనే కోరిక ఉండవు కాని సాధారణ అవసరాలు తీరితే సరిపోతుంది. తాము చేస్తున్న పనిలో లోకాన్ని కూడా మరిచి పోతారు.

 

తాము ఎప్పుడూ బయట పడాలని కోరుకోరు. అన్ని విషయాలు బయటివారికి చెప్పరు. కాని కొన్ని సందర్భాల్లో తమకు ఏమీ తోచకుండా ఏ పనిచేసినా ఇబ్బంది అనిపిస్తూ ఉండి అది సహజ నవమ స్థానమైన ఈ విధంగా ఉంటుంది. ఏ పని చేసినా సంతృప్తి లేదు - అన్ని పనుల్లోనూ ఇబ్బందులున్నాయి -  సకాలానికి పనులు జరగడం లేదు - జరుగుతున్న ప్రతి విషయంలో అనుభూతి లోపాలున్నాయి - వారసత్వ సంపదలు అందడం లేదు మొదలైన లోపాలు నవమభావ సంబంధ లోపాలు సాధారణంగా మనం గమనిస్తుంటాం.

 

నవమాధిపతి త్రికస్థానాల్లో ఉన్నా, నవమంలో త్రిక స్థానాధిపతులు గాని, అశుభగ్రహాలు గాని ఉన్నా, నవమాధిపతికి, నవమానికి త్రిక స్థానాధిపతులతో ఏవిధమైన సంబంధం ఉన్నా సర్వాష్టక వర్గులో నవమంలో 24 కన్నా తక్కువ బిందువులు ఉన్నా, భిన్నాష్టకవర్గులో గ్రహం నవమంలో 4 కన్నా తక్కువ బిందువులు పొంది ఉన్నా నవమ భావ లోపాలుగా భావించాల్సి ఉంటుంది.

 

పూర్వకర్మలలో తగినన్ని దానధర్మాలు చేసుకోక పోవడం, ఇతరులను అసంతృప్తికి గురి చేసి తాను ఆనందించడం, పెద్దలను వ్యతిరేకించడం, పారంపర్యంలోని పెద్దలను ఎప్పటికీ నిందించడం, వారికి గౌరవ మర్యాదలు ఇవ్వకపోవడం, ప్రకృతిని ఉపయోగించుకోవడం, నాశనం చేయడం, కాలుష్యాలు తయారు చేయడం వంటి కార్యాల వల్ల భాగ్యం కోల్పోయి నవమ భావ లోపాలను ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. అసంతృప్తులవుతారు.

 

పరోపకారం అధికంగా చేయడం, నిరంతరం దానధర్మాలు చేస్తూ ఉండడం, మనస్సు సంచలనం పొందకుండా ఎప్పటికీ జపం చేస్తూ ప్రకృతికి, లోకానికి, విశ్వానికి అనుకూలంగా ఉండాలని ప్రార్థించడం, పెద్దలకు తగిన గౌరవ మర్యాదలను అందించడం, ఎదుటివారి మేలుకోసం ఎప్పటికీ ఆలోచించడం, ప్రశాంతతను పొందే ప్రయత్నం చేయడం ద్వారా జ్యోతిర్వైద్య ప్రక్రియలో తమ లోపాలను కొంతవరకు మార్చుకునే అవకాశం ఉంటుంది.

 

లోకంలో అంతా సంతృప్తే. అన్ని పనుల్లోనూ ఆనందమే ఉన్నది. చూసే విధానాన్ని మార్చుకోవడం ద్వారా అనుభూతి పొందగలుగుతున్నాం. ప్రకృతిలో అన్నీ పూర్ణమై ఉన్నాయి. ప్రశాంతంగా అనుభవిస్తే అన్నింటిలోనూ అనుభూతి మాత్రమే మిగులుతుంది. తొందరపాటు కూడదు. అందరికీ ఆనందం కలగాలి, అందరూ ప్రశాంతులై ఉండాలి అనే ధోరణితో కూడుకున్న ఆలోచనలకు ప్రాధాన్యమిస్తే నవమభావ లోప నివారణ కలుగుతుంది.

 

తాము అనుకున్న పనులు పూర్తిచేస్తే లక్షణం కలవారు కాబట్టి అభివృద్ధిమార్గంవైపు తమ పయనం సాగించేటట్లు ఉండాలి. దాని ద్వారా పూర్వపుణ్యాన్ని పెంచుకుని కర్మదోషాలను తొలగించుకోవచ్చు.

డా.ప్రతిభ

ఇవి కూడా చదవండి..

వృశ్చికరాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

తుల రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

కన్య రాశి జాతకం ఇలా ఉంటుంది..దోషాలు ఇవే..

జ్యోతిష్యం.. సింహ రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. కర్కాటక రాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. మిథునరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

జ్యోతిష్యం.. వృషభరాశి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

‘మేషరాశి’ వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది..? ఎలా మార్చుకోవచ్చు?

click me!