నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

By narsimha lodeFirst Published Mar 15, 2019, 8:15 AM IST
Highlights

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి తన సోదరుడు వైఎస్ఆర్ కొడుకు జగన్‌తో విబేధించారు

పులివెందుల:ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన వైఎస్ వివేకానందరెడ్డి తన సోదరుడు వైఎస్ఆర్ కొడుకు జగన్‌తో విబేధించారు. జగన్ కాంగ్రెస్‌ను వీడి వైఎస్ఆర్‌ను ఏర్పాటు చేసిన సమయంలో వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

2009 సెప్టెంబర్ 2న వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన ఆయన అభిమానులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు.

అయితే ఆ సమయంలో ఓదార్పు యాత్రకు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంగీకరించలేదు.అయినా కూడ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. 2011 మార్చి 11వ తేదీన వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో జగన్‌తో వివేకానందరెడ్డి విబేధించారు. వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2009లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా వైఎస్ వివేకానంద రెడ్డి అడుగుపెట్టారు.

 జగన్ తో విబేధించిన సమయంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకుగాను ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రివర్గంలోకి వైఎస్ వివేకానందరెడ్డిని తీసుకొన్నారు.కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో వైఎస్ వివేకానందరెడ్డి వ్యవసాయ శాఖమంత్రిగా పనిచేశారు.2010 నవంబర్ 30న మంత్రిగా వైఎస్ వివేకానందరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

2011 లో కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీని వీడిన సమయంలో ఈ రెండు స్థానాలకు వైఎస్ విజయమ్మ, జగన్ రాజీనామా చేశారు. ఆ ఉప ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుండి అప్పటి మంత్రి మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి వదినకు వ్యతిరేకంగా వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.

అయితే వైఎస్ విజయమ్మ చేతిలో వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలయ్యారు. కానీ, ఈ ఎన్నికల్లో ఆయనకు 80 వేల ఓట్లు వచ్చాయి.వైఎస్ వివేకానందరెడ్డి కాకుండా మరో అభ్యర్ధి అయితే కాంగ్రెస్ పార్టీకి ఈ మేరకు ఓట్లు వచ్చేవికావని ఆనాడు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడ్డారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న సోదరుడే వైఎస్ వివేకానందరెడ్డి.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని పులివెందుల అసెంబ్లీ స్థానం నుండి 1989,1994 ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందరు.ఈ రెండు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి నెగ్గారు.

సంబంధిత వార్తలు

బ్రేకింగ్: జగన్ బాబాయ్.. వైఎస్ వివేకా కన్నుమూత

తల, చేతిపై గాయాలు: వైఎస్ వివేకా మరణం వెనుక కుట్ర కోణం..?

నాడు జగన్‌తో విభేదాలు: విజయమ్మపై వైఎస్ వివేకా పోటీ

వివేకా బాత్‌రూం, బెడ్‌రూంలో రక్తపు మరకలు: కడప ఎస్పీ

వివేకానందరెడ్డి మరణంపై లోతైన దర్యాప్తు జరపాలి: విజయసాయి

వైఎస్ వివేకా మృతి.. లోకేష్ సంతాపం

నిన్న ప్రచారంలో వైఎస్ వివేకా: ఇంతలోనే ఇలా...

వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ ప్రస్థానం

 

click me!