ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

By narsimha lodeFirst Published Mar 28, 2019, 4:51 PM IST
Highlights

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలను నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు  తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

అమరావతి: ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలను నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు  తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలను నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు లంచ్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేసింది.ఈ పిటిషన్‌పై ఇవాళ ఇరు వర్గాలు వాదనలను విన్పించారు. మద్రాసు, హైకోర్టు తీర్పులను ఏపీ ప్రభుత్వం గురువారం నాడు  హైకోర్టులో ప్రస్తావించారు. ఆలిండియా సర్వీస్ అధికారులపై చర్యలు సరికావని ఏపీ సర్కార్ ప్రస్తావించింది.

ప్రజా ప్రాతినిథ్య చట్టం పరిధిలోకి రాని అధికారులపై ఈసీ చర్యలను ఏపీ సర్కార్ తప్పుబట్టింది.నాలుగు గంటల పాటు ఈ విషయమై వాదనలు జరిగాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్, వైసీపీ తరపున సీవీ మోహన్ రెడ్డి,  ఈసీ తరపున ప్రకాష్ రెడ్డి వాదనలను విన్పించారు.

ఐపీఎస్ ల బదిలీల విషయంలో ప్రభుత్వం చేస్తున్న వాదనపై ఏపీ సర్కార్ వితండవాదం చేస్తోందని ఈసీ తరపు న్యాయవాది ప్రకాస్ రెడ్డి కోర్టులో వాదించారు. ఐపీఎస్‌ల అధికారులను ఎన్నికల సమయంలో బదిలీ చేయడం ఆనవాయితీగా వస్తోందని  ఆయన ప్రశ్నించారు.

ఇంటలిజెన్స్ డీజీ  విషయంలో ప్రభుత్వం ఎందుకు పట్టుబడుతోందో చెప్పాలని  ఈసీ, వైసీపీ తరుపున న్యాయవాదులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో డీజీపీగా ఉన్న ఎస్ఎస్ యాదవ్ స్థానంలో ఆయన అప్పటి సీఎం వైఎస్ఆర్‌కు అనుకూలంగా మాట్లాడినందుకు గాను ఆయనను తప్పించి ఏకే మహంతిని తెచ్చిన విషయాన్ని వైసీపీ తరపున న్యాయవాది గుర్తు చేశారు.

బదిలీల విషయంలో జీవోలను జారీ చేసి స్పెషల్ బ్రాంచీ, ఇంటలిజెన్స్ అధికారులను సీఈసీ పరిధిలోకి రారని జీవోలు జారీ చేయడంపై ఈసీ తప్పుబట్టింది. ఎన్నికల సంఘానికి పంపిన జాబితాలో ఈ విషయమై ఎందుకు స్పష్టం చేయలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో రేపు వాదనలు

కీలక జీవోను జారీ చేసిన చంద్రబాబు సర్కార్:ఇంటలిజెన్స్‌కి మినహాయింపు

మేమే చెప్పాం, అందుకే ఇంటలిజెన్స్ డీజీ బదిలీ: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి

ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్

ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు: ఈసీపై చంద్రబాబు సీరియస్

click me!