ఎన్నికల సెంటిమెంట్: ఏలూరులో ఏ పార్టీ గెలిస్తే వాళ్లదే అధికారం

By Siva KodatiFirst Published Mar 25, 2019, 7:48 AM IST
Highlights

అన్ని రంగాల్లో ఉన్నట్లే ఎన్నికల్లోనూ సెంటిమెంట్లు ఉన్నాయి. కొందరు వీటిని బ్లండ్‌గా ఫాలో అయిపోతారు. ఇంకొందరు కష్టాన్నే నమ్ముకుంటారు. నామినేషన్ల  దగ్గర నుంచి ప్రచారాన్ని ముగించే వరకు సెంటిమెంట్లు చెప్పినట్లు నడుచుకునే నేతలను ఎంతోమందిని చూశాం. 

ఇక  కొన్ని నియోజకవర్గాలు సెంటిమెంట్‌కు కేరాఫ్‌గా నిలుస్తుంటాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీయే అధికారంలోకి వస్తుందని, లేదంటే ప్రతిపక్షంలో కూర్చుంటుందని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వుంటారు.

అలాంటి వాటిలో ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు. ఇక్కడ ఏ జెండా ఎగిరితే.. రాష్ట్రంలోనూ ఆ జెండానే అధికారాన్ని అందుకుంటుంది. 1989 నుంచి 2014 వరకు గత ఆరు పర్యాయాలు ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది.

1989లో ఇక్కడ కాంగ్రెస్ గెలవగా.. రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చింది. ఇక 1994, 1999 ఎన్నికల్లో టీడీపీ గెలిచి, వరుసగా రెండుసార్లు పవర్‌లోకి వచ్చింది. 2004, 09లలో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ గెలవడంతో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యారు.

2014లో టీడీపీ విజయం సాధించడంతో.. నవ్యాంధ్రలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో తాజా ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారోనని ఇక్కడ జోరుగా చర్చ నడుస్తోంది. ఈ సారి టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి, వైసీపీ నుంచచి ఆళ్ల నాని, జనసేన అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడు బరిలో నిలిచారు. 

click me!