పాలన అమరావతిలో, కుట్రలు సైబరాబాద్‌లో: బాబుపై పార్థసారథి ఫైర్

By Siva KodatiFirst Published Mar 4, 2019, 1:46 PM IST
Highlights

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్ల జాబితాకు సంబంధించిన డేటా లీక్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు. 

హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్ల జాబితాకు సంబంధించిన డేటా లీక్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోని రాజకీయ నాయకుల్లో అందరికన్నా నేనే సీనియర్ అని చెప్పుకునే సీఎం... ఈ రాష్ట్రానికి మేలు చేయటానికి ఏనాడు అనుభవాన్ని ఉపయోగించలేదని ఎద్దేవా చేశారు.

ఒకవేళ అభివృద్ధి చేస్తే అందులో తన వాటా ఎంతో ముందుగానే లెక్క లేసుకుంటారని పార్థసారథి ఆరోపించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని... కష్టాల్లో ఉందని చెబుతూనే దీనిని ఏ విధంగా దోచుకోవాలో ప్లాన్లు వేస్తూ ఉంటారని ధ్వజమెత్తారు.

అధికారం ఆంధ్రప్రదేశ్‌లో అని, కుట్రలు పన్నుతోంది మాత్రం హైదరాబాద్‌లో అంటూ ఆయన మండిపడ్డారు. తన అధికారానికి ఇబ్బంది కలిగినప్పుడల్లా ఆయనకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని గుర్తుకొస్తూ ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి... ఇది ఉమ్మడి రాజధాని అని తమకు ఏసీబీ ఉందంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతూ ఉంటారన్నారు. ఉమ్మడి ఖాతాలో ఉన్న నిధుల విషయంపై కూడా ఏమాత్రం సంప్రదించకుండా కాపాడబడితే చాలని, తాను కేసు నుంచి తప్పించుకుంటే చాలని నాడు బెజవాడ పారిపోయి వచ్చారని పార్థసారథి గుర్తు చేశారు.

ఏపీ ప్రజల కోసమే బెజవాడ వచ్చానని అవసరమైతే బస్సులోంచే పాలన చేస్తానని ముఖ్యమంత్రి చెబుతూ ఉంటారని ఎద్దేవా చేశారు. తాజాగా ఓటర్ల లిస్టు దగ్గర నుంచే కుట్రలు ప్రారంభించారని పార్థసారథి తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికలను పూర్తిగా డబ్బు మయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనన్నారు. ఐటీ శాఖను కొడుకు చేతిలో పెట్టి... దీని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఓటర్ల లిస్టును మాయం చేయడానికి ముఖ్యమంత్రి స్కెచ్ గీశారని పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా నోరు మెదిపిన వారిని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్థసారథి విమర్శించారు. 

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

click me!