రిటర్న్ గిఫ్ట్ ఇదేనా... కేసీఆర్ కి లోకేష్ చురకలు

Published : Mar 04, 2019, 10:48 AM IST
రిటర్న్ గిఫ్ట్ ఇదేనా... కేసీఆర్ కి లోకేష్ చురకలు

సారాంశం

ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటా చోరీ అయిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై.. మంత్రి లోకేష్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యంగాస్త్రాలు విసిరారు. 

ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటా చోరీ అయిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై.. మంత్రి లోకేష్.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వ్యంగాస్త్రాలు విసిరారు. తెలంగాణ ఎన్నికల సమయంలో.. చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ.. కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిని, డేటా చోరీ రెండు విషయాలను కలిపి మరీ లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

‘‘రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటే ధైర్యంగా వచ్చి దొంగ అబ్బాయి తరపున ప్రచారం చేస్తారు అనుకున్నా, కానీ మీరు డేటా దొంగలించి హైదరాబాద్ ఐటీ బ్రాండ్ ని దెబ్బతీసారు’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి టీఎస్ గవర్నమెంట్స్ స్టీల్స్ డేటా అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఇచ్చారు.

మరో ట్వీట్ లో .. ‘‘హై కోర్ట్ సాక్షి గా దొర గారి దొంగతనం బయటపడింది. తెల్లకాగితాల పై విఆర్ఓ సంతకాల తో అడ్డంగా దొరికిపోయారు. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు గారిని ఎదుర్కొనే దమ్ములేక ఐటీ కంపెనీల పై దాడి చేసి, ఉద్యోగస్తులను అక్రమంగా అరెస్ట్ చేసారు అని తేలిపోయింది’’ అని పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం