టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్ వివాదం: కేసీఆర్‌పై భగ్గుమన్న చంద్రబాబు

By narsimha lodeFirst Published Mar 4, 2019, 10:27 AM IST
Highlights

టీడీపీ కోసం పనిచేసే వారికి వ్యతిరేకంగా కేసులు పెట్టడమేనా కేసీఆర్ తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గిఫ్ట్‌లు, రిటర్న్‌ గిఫ్ట్‌లు ప్రతీకారంతో ఇస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు.

అమరావతి: టీడీపీ కోసం పనిచేసే వారికి వ్యతిరేకంగా కేసులు పెట్టడమేనా కేసీఆర్ తనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటూ చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గిఫ్ట్‌లు, రిటర్న్‌ గిఫ్ట్‌లు ప్రతీకారంతో ఇస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ  చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్‌పై కేసులు పెట్టడాన్ని చంద్రబాబునాయుడు ఖండించారు. ఏపీలో టీడీపీ కోసం పనిచేసే వారిపై తెలంగాణలో కేసులు  పెడతారా అని ఆయన ప్రశ్నించారు.ఇలాంటి  గిఫ్ట్‌లన్నింటిని  తీసుకొంటామని బాబు స్పష్టం చేశారు. సైబర్ కుట్రలతో హైద్రాబాద్ ప్రతిష్టను దిగజార్చారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమిని అంగీకరించిందని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు. 20 ఏళ్లుగా కంప్యూటీకరించిన పార్టీ సమాచారాన్ని వైసీపీ దొంగిలించేందుకు కుట్ర పన్నిందని ఆయన ఆరోపించారు.

సోమవారం నాడు టీడీపీ నేతలతో చంద్రబాబునాయుడు టెలికాన్పరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్పరెన్స్‌లో హైద్రాబాద్ కేంద్రంగా ఐటీ గ్రిడ్‌పై నమోదైన కేసుల విషయమై చంద్రబాబునాయుడు ప్రస్తావించారు. 

టీడీపీ సాంకేతికతను ప్రోత్సహిస్తోంటే , వైసీపీ మాత్రం సైబర్ క్రైమ్‌ను  ప్రోత్సహిస్తోందని చంద్రబాబునాయుడు ఆరోపించారు.  టీడీపీకి చెందిన వ్యవస్థలను దెబ్బతీసే కుట్రలకు వైసీపీ పాల్పడుతోందన్నారు.ఐటీ గ్రిడ్  కంపెనీ విషయంలో  హైకోర్టు తెలంగాణ సర్కార్‌కు  చీవాట్లు పెట్టడం చెంపపెట్టు వంటిందన్నారు. 

కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదేనా అంటూ  చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.  టీడీపీ యాప్ సర్వీస్ ప్రోవైడర్‌పై కేసులు పెట్టడాన్ని చంద్రబాబునాయుడు ఖండించారు. ఏపీలో టీడీపీ కోసం పనిచేసే వారిపై తెలంగాణలో కేసులు  పెడతారా అని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ ఏర్పాటు చేసుకొన్న వ్యవస్థలను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని బాబు ఆరోపించారు. ప్రస్టేషన్‌తో వైసీపీ రగిలిపోతోందన్నారు. ఈ కారణంగానే  వైసీపీ నేతలు హైద్రాబాద్‌లో కేసులు పెట్టారని బాబు ఆరోపించారు. ఆధార్, ఓటర్ల తొలగింపు విషయంలో అవతవకలకు పాల్పడితే కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సిన విషయాన్ని బాబు గుర్తు చేశారు.

ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల డేటా చోరీకి గురైతే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా తెలంగాణ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేశారని బాబు ప్రశ్నించారు. వైసీపీ, టీఆర్ఎస్ బంధం మరోసారి బట్టబయలైందని బాబు విమర్శించారు.

సంబంధిత వార్తలు

ఏపీ పోలీసులు బెదిరిస్తున్నారు, రక్షణ కల్పించండి: లోకేశ్వర్ రెడ్డి

డేటా చోరీ: బాబుతో అడ్వకేట్ జనరల్ భేటీ, ఏం చేద్దాం

డేటావార్: కూకట్‌పల్లిలో ఏపీ పోలీసులకు నో ఎంట్రీ

డేటా చోరీపై ట్విస్ట్: భాస్కర్‌ కోసం హైద్రాబాద్‌కు ఏపీ పోలీసులు

click me!