గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు, ఇంటికే ప్రభుత్వ పథకాలు: వైఎస్ జగన్

By Nagaraju TFirst Published Jan 9, 2019, 6:10 PM IST
Highlights

ప్రతీగ్రామాన్ని గ్రామస్వరాజ్యంగా మారుస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామంలోని ప్రతీ ఇంటికి చేరేలా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు.

ఇచ్ఛాపురం: ప్రతీగ్రామాన్ని గ్రామస్వరాజ్యంగా మారుస్తానని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామంలోని ప్రతీ ఇంటికి చేరేలా సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు. 

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర ముగింపు సభలో పాల్గొన్న జగన్ ప్రతీ గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న జన్మభూమి కమిటీలను రద్దు చేస్తామని చెప్పుకొచ్చారు. 

ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా ప్రజలకు సేవలందించేలా గ్రామ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో గ్రామ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసి ఆ గ్రామానికి చెందిన 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమిస్తామని స్పష్టం చేశారు. 

గ్రామ వాలంటీర్ కు నెలకు రూ.5వేలు జీతం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ గ్రామ వాలంటీర్ గ్రామ సెక్రటేరియట్ తో అను సంధానం చేసుకుంటూ పని చేస్తాడని తెలిపారు. గ్రామ వాలంటీర్ ఎంపికలో ఎలాంటి పక్ష పాతం ఉండబోదన్నారు. 

అర్హతలను బట్టి ఎంపిక చేస్తామని అంతేకానీ చంద్రబాబులా కులం, మతం, రాజకీయ పార్టీల ప్రాతిపదికలు ఉండవన్నారు. ఏ పార్టీ వ్యక్తి అయినా, ఏ మతానికి చెందిన వాడైనా ఎవరైనా అర్హతలను బట్టి ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందించే ప్రతీ పథకాన్ని చివరికి రేషన్ బియ్యం సైతం డోర్ డెలివరీ చేసే అవకాశం కల్పించనున్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

రైతులకు వైఎస్ జగన్ వరాల జల్లు

ఏపీలోని 13 జిల్లాలను 25కి పెంచుతా: ముగింపు సభలో వైఎస్ జగన్

బాబు పాలనలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి : జగన్

పాదయాత్ర ముగింపు సభలో జగన్: నిరుద్యోగులను మోసం చేసిన బాబు

జాతీయ రాజకీయాల పేరుతో చంద్రబాబు డ్రామాలు

ముగిసిన పాదయాత్ర: చంద్రబాబుపై మండిపడ్డ జగన్

ముగిసిన ప్రజాసంకల్పయాత్ర: పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

 

click me!