'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

By narsimha lodeFirst Published Oct 26, 2018, 10:49 AM IST
Highlights

ఆపరేషన్ గరుడలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. 


హైదరాబాద్: ఆపరేషన్ గరుడలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  ఉన్నారని వైసీపీ మాజీ ఎంపీ  వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. 

శుక్రవారం నాడు సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వద్ద వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావు 11 మాసాల క్రితం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని  జగన్‌పై దాడి చేసిన రెండు గంటల్లోనే  ముందుకు తెచ్చారని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు.

శ్రీనివాస రావు వైసీపీ కార్యకర్త అయితే... ఫ్లెక్సీని పసుపు రంగు కలర్‌లో  ఎలా వేశారని  ఆయన ప్రశ్నించారు వైసీపీ కార్యకర్త ఎవరూ కూడ  పసుపు రంగులో ప్లెక్సీలు వేయరని ఆయన  అబిప్రాయపడ్డారు. అంతేకాదు వైఎస్ఆర్ బొమ్మ లేకుండా ఫ్లెక్సీని వైసీపీ అభిమానులు, నేతలు ఎవరూ కూడ ఏర్పాటు చేయబోరని ఆయన చెప్పారు. 

గతంలో వైసీపీ అభిమానులుగా ఉన్నామని... రెండు మాసాల క్రితమే  తామంతా టీడీపీకి సానుభూతిపరులుగా మారారని శ్రీనివాసరావు  సోదరుడు సుబ్బరాజు మీడియాతో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఇటీవల కాలంలోనే శ్రీనివాసరావు కుటుంబానికి రెండు దఫాలు బ్యాంకు రుణాలను  మంజూరు చేసినట్టు  వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీనివాసరావును ప్రలోభపెట్టి టీడీపీ కార్యకర్తగా మార్చారని వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఈ దాడి జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. దాడిపై సమగ్ర విచారణ జరిపించాలని   ఆయన డిమాండ్ చేశారు.2003లో ఉమ్మడి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడిపై మావోలు దాడికి పాల్పడినప్పుడు వైఎస్ఆర్ తిరుపతికి వెళ్లి పరామర్శించి... ధర్నా నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

విశాఖలో ప్రభుత్వాసుపత్రిలో చేరాలని కూడ పోలీసులు కానీ, వైద్యాధికారులు కూడ కోరలేదన్నారు. కానీ ప్రాథమిక చికిత్స జరిగిన తర్వాత  హైద్రాబాద్ ఆసుపత్రిలో చేరినట్టు ఆయన గుర్తు చేశారు.

వైఎస్ జగన్‌పై దాడి ఘటన వెనుక చంద్రబాబునాయుడు ఉన్నారని ఆయన ఆరోపించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో భద్రత ఉండదనే ఉద్దేశ్యంతో హైద్రాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్టు చెప్పారు.


సంబంధిత వార్తలు

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

ఆ విషయం తేలాల్సిందే: జగన్ మీద దాడిపై మోహన్ బాబు

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

 

click me!