'యాత్ర' సినిమాలో ట్విస్ట్: చివర్లో వైఎస్ జగన్ స్పీచ్

By narsimha lodeFirst Published Feb 8, 2019, 5:07 PM IST
Highlights

'యాత్ర' సినిమాలో వైఎస్ జగన్‌ పాత్రను చూపలేదు. సినిమా ముగింపులో వైఎస్ఆర్ ఆశయసాధన కోసం  తాను కృషి చేస్తానని వైసీపీ సభల్లో జగన్  చేసిన ప్రసంగాన్ని చూపించారు.  


హైదరాబాద్: 'యాత్ర' సినిమాలో వైఎస్ జగన్‌ పాత్రను చూపలేదు. సినిమా ముగింపులో వైఎస్ఆర్ ఆశయసాధన కోసం  తాను కృషి చేస్తానని వైసీపీ సభల్లో జగన్  చేసిన ప్రసంగాన్ని చూపించారు.  

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పాదయాత్రను ఇతివృత్తంగా చేసుకొని యాత్ర పేరుతో  సినిమాను తీశారు.  ఈ సినిమాలో ఎక్కడ కూడ జనగ్ ప్రస్తావన చూపించలేదు.

వైఎస్ఆర్ పాదయాత్ర చేస్తూ  అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వైఎస్ విజయమ్మకు జగన్‌ ఫోన్ చేసినట్టుగా సినిమాలో చూపిస్తారు.

విజయమ్మకు ఫోన్ చేసిన జగన్ ‌ వైఎస్ఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తారు.  అదే సమయంలో విజయమ్మ వైఎస్ఆర్‌కు ఫోన్ ఇస్తోంది. నీ పనులన్నీ అయిపోయిన తర్వాతే రావాలని జగన్‌కు వైఎస్ఆర్ సూచించినట్టుగా సినిమాలో చూపించారు. వైఎస్ఆర్ రెండో దఫా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రచ్చబండకు వెళ్తూ  హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో సినిమాను ముగించారు.

ఈ సందర్భంగా సెంటిమెంట్‌ను రగిల్చేలా ఓ పాటను కూడ చేర్చారు.  ఈ పాటకు తగ్గట్టుగానే దృశ్యాలు ఉన్నాయి. దీంతో కొంత ప్రేక్షకులు భావోద్వేగాలకు గురయ్యే అవకాశం లేకపోలేదు. 

అయితే  వైఎస్ఆర్ మృతిని తట్టుకోలేక అనేక మంది తమ ఆవేదనను వెలిబుచ్చిన స్పందనలను కూడ  ఈ సినిమాలో చూపించారు. సినిమా చివర్లో వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తానని వైఎస్ జగన్  ఓ సభలో  చేసిన ప్రసంగాన్ని చూపించారు.  జగన్ సభకు వచ్చిన జనం దృశ్యాలు కూడ ఇందులో ఉన్నాయి.

త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీకి రాజకీయంగా ఈ సినిమా ప్రయోజనం కల్గిస్తోందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయంతో ఉన్నారు.  కానీ,  ఏ మేరకు ఆ పార్టీకి ఈ సినిమా ఉపయోగపడుతోందో చూడాల్సింది.

సంబంధిత వార్తలు

'యాత్ర' సినిమా: గ్రూపు రాజకీయాల నుండి ప్రజా నేతగా వైఎస్

'యాత్ర' సినిమా: వైఎస్ స్కీమ్‌ల ప్రకటన వెనుక

'యాత్ర' సినిమా: కాంగ్రెస్‌ను ప్రాంతీయ పార్టీగా నడిపిన వైఎస్

యాత్ర సినిమా: ఆపద్బాంధవుడుగా వైఎస్ఆర్

యాత్ర సినిమాలో సెంటిమెంట్: గౌరు చరితారెడ్డి సన్నివేశం

'యాత్ర' సినిమా: అచ్చుపోసిన వైఎస్ ఆత్మ కేవీపీ

యాత్ర సినిమా: సబితా ఇంద్రారెడ్డి పాత్ర హైలైట్

 

 

click me!