నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలిచే స్థానాలు ఎన్నో తెలుసా..!

Published : Feb 08, 2019, 04:13 PM IST
నెల్లూరు జిల్లాలో టీడీపీ గెలిచే స్థానాలు ఎన్నో తెలుసా..!

సారాంశం

ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా అయినా కుటుంబంలో ఎవరో ఒకరిమే పోటీలో ఉంటామని ఇద్దరం బరిలో ఉండే ఛాన్స్ లేదన్నారు. తమ ఆశలు ఎలా ఉన్నా అంతిమంగా చంద్రబాబు నాయుడు నిర్ణయానికే కట్టుబడి ఉంటానని బీద రవిచంద్ర స్పష్టం చేశారు. 

నెల్లూరు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి మోగిస్తోందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపట్ల ప్రజలు కృతజ్ఞతతో ఉన్నారని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారన్న నమ్మకం ఉందని తెలిపారు. తన సోదరుడు బీద మస్తాన్ రావు అసెంబ్లీ నుంచి  పోటీ చెయ్యాలని పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. 

ఎంపీగా అయినా ఎమ్మెల్యేగా అయినా కుటుంబంలో ఎవరో ఒకరిమే పోటీలో ఉంటామని ఇద్దరం బరిలో ఉండే ఛాన్స్ లేదన్నారు. తమ ఆశలు ఎలా ఉన్నా అంతిమంగా చంద్రబాబు నాయుడు నిర్ణయానికే కట్టుబడి ఉంటానని బీద రవిచంద్ర స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్