యరపతినేనికి షాక్: కేసులు సీబీఐకు అప్పగింత

Published : Dec 24, 2019, 06:32 PM ISTUpdated : Dec 24, 2019, 09:42 PM IST
యరపతినేనికి షాక్: కేసులు సీబీఐకు  అప్పగింత

సారాంశం

టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావుకు జగన్ సర్కార్ షాకిచ్చింది. యరపతినేని శ్రీనివాసరావుపై ఉన్న కేసులను సీబీఐకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగలశారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. 

అమరావతి: టీడీపీ కీలక నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉన్న కేసులను సీబీఐకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.యరపతినేని శ్రీనివాసరావు పై ఉన్న మైనింగ్ కేసులను సీబీఐకు అప్పగించేందుకు తమకు అభ్యంతరం లేదని గతంలోనే హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.  

Also read:యరపతినేని అక్రమ మైనింగ్ పై జగన్ సీరియస్: కేంద్రానికి నివేదిక

గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉన్న 18 కేసులను సీబీఐ విచారణకు అప్పగిస్తూ మంగళవారం నాడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యరపతినేని శ్రీనివాసరావుపై ఉన్న 17 కేసులతో పాటు వైసీపీకి చెందిన కీలకనేత టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడ ఈ ఉత్తర్వులో ప్రస్తావించింది ప్రభుత్వం.

ఈ ఏడాది ఏప్రిల్‌ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. మైనింగ్ మాఫియాకు యరపతినేని అండగా నిలుస్తున్నారని ఆరోపణలు చేశారు. మైనింగ్ మాఫియా గురించి ప్రశ్నిస్తే దాడులకు పాల్పడ్డారని వైసీపీ విమర్శలు చేసింది.

ఎన్నికల్లో యరపతినేని శ్రీనివాసరావు ఓటమి పాలయ్యాడు. ఎన్నికల్లో యరపతినేని శ్రీనివాసరావు ఓటమి పాలు కావడం, రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోవడంతో యరపతినేని శ్రీనివాసరావుకు కష్టాలు మొదలయ్యాయి.

యరపతినేని శ్రీనివాసరావుపై వైసీపీ సర్కార్ సీఐడీ విచారణ చేసింది.అయితే ఈ కేసును సీబీఐ విచారణకు ఇస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని  హైకోర్టుకు ఏపీ సర్కార్ గతంలోనే చెప్పింది. ఈ తరుణంలోనే సీబీఐకు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై ఉన్న కేసులను సీబీఐ అప్పగిస్తూ ఇవాళ ఉత్తర్వులు విడుదల చేసింది. 

సంబంధిత వార్తలు

సరస్వతి భూముల కోసమే నాపై కేసులు: అజ్ఞాతం వీడిన యరపతినేని

యరపతినేని అక్రమ తవ్వకాలపై సిబిఐ దర్యాప్తు: జగన్ కీలక నిర్ణయం

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

యరపతినేనిపై సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి

అక్రమమైనింగ్ కేసులో టీడీపీ నేత యరపతినేనిపై కేసు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి