సుజనాకు చిక్కులు: విజయసాయి లేఖపై స్పందించిన రాష్ట్రపతి

By narsimha lodeFirst Published Dec 24, 2019, 6:07 PM IST
Highlights

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిపై ఉన్న కేసులను ఈడీ, సీబీఐలతో ి విచారణ చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్పందించారు. 

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ సుజనా చౌదరిపై  ఉన్న ఆర్ధిక నేరాలపై ఈడీ, సీబీఐలతో విచారణ చేయించాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు.  ఈ లేఖను హోంమంత్రిత్వశాఖకు రాష్ట్రపతి కార్యాలయం నుండి పంపారు.

Also Read:'వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి మిస్సింగ్'.. వెతికిపెట్టమంటున్న మహిళలు!

మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మనీలాండరింగ్, ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపించింది.ఈ మేరకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశారు.

రాష్ట్రపతి కార్యాలయం నుండి ఈ లేఖను కేంద్ర హోంశాఖకు పంపారు.రాష్ట్రపతి కార్యాలయం నుండి తమకు లేఖ అందిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుండి లేఖ అందింది.

Also Read:వ్రతం చెడ్డా దక్కని ఫలితం : సుజనా చౌదరికి షాక్

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గత టర్మ్‌లో మోడీ ప్రభుత్వం మంత్రిగా పనిచేశారు. ఏపీకి  ప్రత్యేక హోదాతో పాటు నిధుల కేలాయింపులో అన్యాయం చేశారని ఆరోపిస్తూ టీడీపీ మోడీ మంత్రివర్గం నుండి బైటకు వచ్చింది.టీడీపీ నుండి మంత్రులుగా పనిచేసిన సుజనా చౌదరి, ఆశోక్‌గజపతిరాజులు వైదొలగారు. 

ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత సుజనా చౌదరి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. రాజ్యసభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనం చేశారు.

Also Read:ఏపీలో మూడు రాజధానులు: లాయర్లు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలన్న టీడీపీ నేత

సుజనాచౌదరిపై ఉన్న కేసులకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుండి సీబీఐ, ఈడీలకు ఆదేశాలు అందే అవకాశం లేకపోలేదు.ఇప్పటికే సుజనా చౌదరి గతంలో విచారణకు హాజరయ్యారు. 

బీజేపీలో చేరినంత మాత్రాన కేసుల నుండి ఎవరూ కూడ తప్పించుకోలేరని బీజేపీ ఎంపీలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. సుజనా చౌదరిపై ఉన్న కేసుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

click me!