జనసంచారం లేకపోవటంతో... తిరుమల కొండపై పులుల సంచారం

By Sree s  |  First Published Mar 25, 2020, 4:12 PM IST

తిరుమల గిరులన్ని అడవిలో నెలకొన్న విషయం తెలిసిందే. అక్కడ సాధారణ రోజుల్లో ప్రజలు మెట్ల మార్గంలో నడుస్తుంటేనే చిరుతలు సంచరించేవి. ఎలుగుబంట్లు కూడా కనపడేవి. ఇప్పుడు అక్కడ ప్రజలు ఎవ్వరు లేకపోవడంతో అడవి మృగాలు కొండపైన సంచారం చేస్తున్నాయి. 


 కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా వైరస్ అనే పేరు చెబితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వైరస్ కి ఇంకా సరయిన మందు లేకపోవడంతో నివారణే మార్గంగా దేశాలన్నీ ఆ దిశగా శ్రమిస్తున్నాయి. జనసమ్మర్ధమైన ప్రాంతాలను మూసివేసి ప్రజలను అలా గుంపులుగా కలవనీయకుండా చర్యలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. 

ఇప్పటికే భారతదేశంపై కరోనా తన పంజాను విసరడం ఆరంభించింది. ఇటలీ, అమెరికాలను చూసి త్వరగా మేల్కొన్న భారతదేశం దేశమంతా 21 రోజులపాటు లాక్ డౌన్ ను ప్రకటించింది. 

Latest Videos

Also Read:తెలంగాణలో మరో మూడు కాంటాక్ట్ కేసులు: 39కి చేరిన కరోనా సంఖ్య

ఈ లాక్ డౌన్ కన్నా ముందే... దేశంలోని అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాలను మూసివేశారు. ఆయా పుణ్యక్షేత్రాల్లో నిత్యకైంకర్యాలకు ఎటువంటి ఆటంకం రాకుండా పూజారులు చూసుకుంటున్నప్పటికీ... ప్రజలకు మాత్రం దర్శనాన్ని నిలిపివేశారు. 

తిరుమల వెంకన్న ఆలయాన్ని కూడా ఇలాగే మూసివేసారు. తిరుమలలో ఇలా ఆలయాలను భక్తులకు మూసివేయడంతో తిరుమల గిరులన్ని ఖాళీ అయ్యాయి. నిత్యం కొన్ని లక్షల మంది ప్రజలు ఘాట్ రోడ్ల గుండా, మెట్ల మార్గం గుండా తిరుమలను చేరుకునేవారు. 

తిరుమలలో లక్ష మందన్నా జనం ఎప్పుడు కొండపైన్నే ఉండేవారు. అల్లాంటి తిరుమల ఇప్పుడు బోసిపోయింది. తీరుమల ఇలా బోసి పోవడంతో ఇప్పుడక్కడ కేవలం సిబ్బంది క్వార్టర్స్ లో ఉండేవారు, అర్చకులు మొదలగు కొంతమంది మాత్రమే ఉన్నారు. 

తిరుమల గిరులన్ని అడవిలో నెలకొన్న విషయం తెలిసిందే. అక్కడ సాధారణ రోజుల్లో ప్రజలు మెట్ల మార్గంలో నడుస్తుంటేనే చిరుతలు సంచరించేవి. ఎలుగుబంట్లు కూడా కనపడేవి. ఇప్పుడు అక్కడ ప్రజలు ఎవ్వరు లేకపోవడంతో అడవి మృగాలు కొండపైన సంచారం చేస్తున్నాయి. 

Also Read:లాఠీ దెబ్బ సురక్షితం: శానిటైజర్లు పూసి మరీ దంచుతున్న పోలీసులు, వీడియో వైరల్

తాజాగా అక్కడ చిరుతలు, ఎలుగుబంట్లు సంచరించాయి. లింక్ రోడ్డు - కళ్యాణ వేదిక - ముల్లగుంట ప్రాంతాల్లో చిరుతలు సంచరించాయని, నారాయణగిరి ఉద్యానవనం వద్ద ఎలుగుబంటి సంచరించిందని అధికారులు తెలిపారు. 

ఇలా అడవి జంతువులు సంచరిస్తుండటంతో అక్కడ నివాసంఉంటున్న వారు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలను రాత్రిపూట ఇండ్లలోంచి బయటకు రావొద్దని అటవీ అధికారులు కోరుతున్నారు. 

click me!