తల్లిని వదిలించుకొనేందుకు ఓ కొడుకు దుర్మార్గంగా ఆలోచించాడు. కరోనా వైరస్ ఉందని చెప్పి తల్లిని వదిలించుకొనే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పన్నాగం బయటపడింది.
విజయనగరం: తల్లిని వదిలించుకొనేందుకు ఓ కొడుకు దుర్మార్గంగా ఆలోచించాడు. కరోనా వైరస్ ఉందని చెప్పి తల్లిని వదిలించుకొనే ప్రయత్నం చేశాడు. అయితే ఈ పన్నాగం బయటపడింది.
విశాఖపట్టణం జిల్లా అనకాపల్లికి చెందిన ప్రభావతికి ఇద్దరు కుమారులు. వీరిద్దరికి పెళ్లిళ్లు అయ్యాయి. ప్రభావతి భర్త మృతి చెందాడు.ప్రభావతి ప్రస్తుతం చిన్న కొడుకు వద్ద అనకాపల్లిలో ఉంటుంది. అయితే తల్లిని వదిలించుకోవాలని చిన్న కొడుకు ప్లాన్ చేశాడు.. ఇదే సమయంలో తల్లి అనారోగ్యానికి గురైంది.
భార్యను తీసుకొని చిన్నకొడుకు విజయనగరానికి వెళ్లాడు. తల్లిని అనకాపల్లిలోని అద్దె ఇంటిలోనే ఉంచాడు. అద్దె ఇల్లు కావడంతో ఇంటి యజమాని ఇల్లును ఖాళీ చేయాలని కోరాడు.
అనకాపల్లిలో ఇల్లును ఖాళీ చేసి తల్లిని చిన్న కొడుకు విజయనగరానికి తీసుకెళ్లాడు. అయితే అత్తారింటి వద్ద తల్లితో పాటు తాను ఉన్నాడు. అయితే తల్లిని వదిలించుకొనేందుకు అతను ప్లాన్ చేశాడు.
దీంతో ప్రభావతికి కరోనా ఉందని చెప్పి ఆసుపత్రిలో చికిత్స నిర్వహించారు. ప్రభావతికి కరోనా లేదని వైద్యులు తేల్చి చెప్పారు. ఆమెను ఇంటికి తీసుకెళ్లాలని కూడ సూచించారు వైద్యులు. అయితే ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకెళ్లే సమయంలో ప్రభావతిని రోడ్డు పక్కన వదిలేసి వెళ్లాడు అతను.
ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రభావతి చిన్న కొడుకు కోసం ఆరా తీశారు. అయితే అప్పటికే అతని ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది..
అయితే విజయనగరం పట్టణంలోనే ప్రభావతి సోదరి సుమతి కూడ నివాసం ఉంటుంది. పోలీసులు ఆమెకు సమాచారం ఇవ్వడంతో ఆమె తన ప్రభావతి చిన్న కొడుకు వద్దకు వెళ్లి వార్నింగ్ ఇచ్చింది. తల్లిని చూసుకోకపోతే కేసు పెడతానని హెచ్చరించింది.