సెప్టెంబర్ తర్వాత ఏపీ ఆర్ధికంగా బలోపేతం: జ్యోతిష్య పండితుడు

Published : Mar 25, 2020, 10:35 AM ISTUpdated : Mar 25, 2020, 10:45 AM IST
సెప్టెంబర్ తర్వాత ఏపీ ఆర్ధికంగా బలోపేతం: జ్యోతిష్య పండితుడు

సారాంశం

ఈ ఏడాది సెప్టెంబర్ మాసం తర్వాత ఏపీ రాష్ట్రం ఆర్ధికంగా బలోపేతమయ్యే అవకాశం ఉందనిి జ్యోతిష్య సిద్దాంతి కప్పగుంట్ల సుబ్బారావు చెప్పారు.  

విజయవాడ: ఈ ఏడాది సెప్టెంబర్ మాసం తర్వాత ఏపీ రాష్ట్రం ఆర్ధికంగా బలోపేతమయ్యే అవకాశం ఉందనిి జ్యోతిష్య సిద్దాంతి కప్పగుంట్ల సుబ్బారావు చెప్పారు.

ఉగాదిని పురస్కరించుకొని విజయవాడ కనకదుర్గ దేవాలయంలో బుధవారం నాడు పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో పాటు దేవాదాయశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ ఏడాది రాష్ట్రంలో మంచి పంటలు పండే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెప్పారు. అయితే అక్టోబర్ మాసంలో తుఫాన్ వచ్చే అవకాశం ఉందన్నారు.
కరోనా ప్రభావం మే 30వ తేదీ నుండి సెప్టెంబర్ వరకు రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య సిద్దాంతి కప్పగుంట్ల సుబ్బారావు చెప్పారు.

కరోనా వైరస్ కాకుండా అంటువ్యాధులపై కూడ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకొన్న విషయాన్ని 
ఆయన గుర్తు చేశారు. 

ఈ ఏడాది పంటలు బాగా పండే అవకాశం ఉందని ఆయన జ్యోతిష్య సిద్దాంతి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం గడుపుతారని ఆయన చెప్పారు.

రాహు ప్రభావం సెప్టెంబర్ నుండి  దాటే అవకాశం ఉందన్నారు. దీంతో రాష్ట్రం  ఆర్ధికంగా బలోపేతమయ్యే అవకాశం ఉందని సుబ్బారావు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్