రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

By narsimha lode  |  First Published Jan 21, 2020, 7:01 PM IST

 ఏపీ శాసనమండలిలో   ప్రభుత్వం బిల్లులు పెట్టకుండా  టీడీపీ అడ్డుకొనే రూల్ 71 ప్రకారం అడ్డుకొనే ప్రయత్నం చేసింది.


అమరావతి: ఏపీ శాసనమండలిలో   ప్రభుత్వం బిల్లులు పెట్టకుండా  టీడీపీ అడ్డుకొనే రూల్ 71 ప్రకారం అడ్డుకొనే ప్రయత్నం చేసింది. అయితే మంగళవారం నాడు సాయంత్రం  ప్రభుత్వ బిల్లులను మండలి ఛైర్మెన్ షరీఫ్ పరిగణనలోకి తీసుకొన్నారు. 

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

Latest Videos

శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ బిల్లును ప్రవేశ పెట్టకుండా టీడీపీ అడ్డుకొంది. రూల్ 71 కింద టీడీపీ  నోటీసు ఇచ్చింది. మండలిలో టీడీపీకి 34 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 9 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. 

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

శాసనసభ ఆమోదం తెలిపి పంపిన బిల్లును మండలికి పంపారు. ఈ బిల్లుపై మండలిలో ప్రవేశపెడితే విపక్ష సభ్యులు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపొచ్చు. లేదా బిల్లును వెనక్కు పంపే అవకాశం ఉంటుంది. మండలిలో టీడీపీకి మెజారిటీ ఉంది.ఈ కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది.  

Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్

 అయితే ఈ విషయమై మరోసారి అసెంబ్లీ ఆమోదం తెలిపి శాసన మండలికి పంపాలి. నెల రోజుల్లో ఈ బిల్లుకు మండలి ఆమోదం తెలపాల్సి ఉంటుంది.

Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి

Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

ఈ రెండు బిల్లులను ద్రవ్య బిల్లు కాకుండా  ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో టీడీపీ ఈ అవకాశాన్ని తనకు అనకూలంగా ఉపయోగించింది. ద్రవ్య బిల్లు అయితే శాసనమండలి ఆమోదం తెలపాల్సిన అవసరం లేదు.  

ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై టీడీపీ రూల్ 71ను అస్త్రంగా ఎంచుకొంది. మంగళవారం నాడు సాయంత్రం వరకు 71 రూల్ ను అడ్డుపెట్టి బిల్లు సాయంత్రం వరకు బిల్లును చర్చ జరగకుండా అడ్డుకొంది.

 రూల్ 71పై చర్చ జరిగితే బిల్లులు అవసరం లేదని టీడీపీ సభ్యులు తమ వాదనను  విన్పించే అవకాశం ఉండేది. అయితే బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత రూల్ 71 కింద చర్చను చేపట్టాలని  ప్రభుత్వం కోరింది. 

అయితే ప్రభుత్వం బిల్లులపై చర్చ జరిపితే రూల్ 71 కింద నోటీసుకు అర్ధం లేకుండా పోతోందని  టీడీపీ సభ్యులు  అభిప్రాయపడ్డారు. ఏపీ ఆర్థికశాఖ  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన ప్రతిపాదనను ఛైర్మెన్ షరీఫ్ పరిగణనలోకి తీసుకొన్నారు.  
 

 

click me!