ఏపీ రాష్ట్ర శాసనమండలిలో టీడీపీ ప్రయోగించిన 71 రూల్ తో వైసీపీ ఆత్మరక్షణలో పడింది.
అమరావతి: ఏపీ రాష్ట్ర శాసనమండలిలో 71 రూల్ కింద టీడీపీ సభ్యులు అధికార వైసీపీని ఇరుకున పెట్టింది. శాసనమండలిలో బలం ఉన్న టీడీపీ 71 రూల్ కింద నోటీసు ఇచ్చి అధికారపక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది. అసలు రూల్ 71 అంటే ఏమిటీ, దీని వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది.
also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?
undefined
Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ
ఏపీ శాసన మండలిలో రూల్ 71 కింద విపక్షానికి కొన్ని హక్కులు ఉంటాయి. ఈ రూల్ ను ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో మంగళశారం నాడు టీడీపీ ఉపయోగించుకొంది. ఈ నిబంధనను ఉపయోగించుకొని టీడీపీ వైసీపీని రాజకీయంగా ఇరుకున పెట్టింది. రూల్ 71 కింద చర్చ జరిగితే ఓటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది.
Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?
also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ
Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్
అయితే ఈ నిబంధనను ఇంతవరకు ఎవరూ కూడ ఉపయోగించుకోలేదని శాసనసభ రికార్డులు చెబుతున్నాయి. ఏపీ శాసనమండలిలో టీడీపీ సభ్యులు రూల్ 71ను ప్రయోగించి పాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకొన్నారు.
Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి
Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ
మూడింట రెండొంతుల సభ్యుల బలం ఉంటే రూల్ 71 కింద సభ్యులు నోటీసు ఇచ్చే అధికారం ఉంటుంది. మంగళవారం నాడు టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు శాసనమండలిలో రూల్ 71 అంశాన్ని ప్రస్తావించారు.
Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని
అయితే రూల్ 71 వర్తించదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు రూల్ 71 అంశాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు రూల్ బుక్ లోని రూల్ 71ను చదివి విన్పించారు.
సభలో రూల్ 71 కింద నోటీసు ఇచ్చే అధికారం ఉందని టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఈ సమయంలో సభలో టీడీపీ సభ్యులను లెక్కించి రూల్ 71 కింద నోటీసు ఇవ్వచ్చని శాసనమండలి ఛైర్మెన్ ప్రకటించారు. ప్రభుత్వం పాలన వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే నోటీసుపై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది.
మంగళవారం నాడు ఉదయం నుండి సుమారు నాలుగు దఫాలు శాసనమండలిలో వాయిదా పడింది. అధికార పార్టీకి చెందిన సభ్యులు శాసనమండలి ఛైర్మెన్ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేశారు.రూల్ 71 కింద చర్చకు టీడీపీ సభ్యులకు శాసనమండలి ఛైర్మెన్ అనుమతి ఇవ్వడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
శాసనసభలో వైసీపీకి బలం ఉంది. శాసనమండలిలో వైసీపీ కంటే టీడీపీ సభ్యుల బలం ఎక్కువ. దీంతో ఏపీ పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టకుండా టీడీపీ 71 రూల్‌ను ప్రయోగించి సక్సెస్ అయింది. అయితే శాసనమండలిలో టీడీపీకి సభ్యులు ఎక్కువగా ఉన్నందున మండలిని రద్దు చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.