మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

Published : Jan 22, 2020, 01:58 PM ISTUpdated : Jan 22, 2020, 03:33 PM IST
మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

సారాంశం

ఏపీ శాసనమండలిలో బుధవారం నాడు ఏపీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. 


అమరావతి: ఏపీ శాసనమండలిలో మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కు, మంత్రులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. బుధవారం నాడు  పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా  ఈ ఘటన చోటు చేసుకొంది.

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లు విషయాలపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రసంగించారు. దేవాలయాలు , సత్రాల భూములు అమ్మాలని ప్రభుత్వం జీవోలు జారీ చేసిన విషయాన్ని లోకేష్ సభలో ప్రస్తావించారు. 

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

లోకేష్ చేసిన విమర్శలపై ఏపీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వం జీవోలను విడుదల చేయలేదని చెప్పారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. సభను తప్పుదారి పట్టించినందుకు సభకు లోకేష్ క్షమాపణ చెప్పాలని కోరారు. 

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

అయితే వెంటనే టీడీపీ సభ్యులు నారా లోకేష్ తన మొబైల్ ఫోన్‌ తీసుకొని గత ఏడాది జూలై మాసంలో  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను లోకేష్ సభలో ప్రస్తావించారు. రెవిన్యూ సెక్రటరీ, జిల్లాల కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశాలను లోకేష్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

ఈ సమయంలో  మంత్రి  బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకొన్నారు. సభలోకి లోకేష్ మొబైల్ ఎలా తీసుకువస్తారని ప్రశ్నించారు. మొబైల్ ఫోన్‌లలో ఉన్న జీవోను చదివి విన్పించడంలో తప్పేం ఉందని  ప్రశ్నించారు టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.

Also read:మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?

also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ

Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్


 

PREV
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu