బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

Published : Jan 22, 2020, 12:51 PM ISTUpdated : Jan 22, 2020, 01:42 PM IST
బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

సారాంశం

మూడు రాజధానుల అంశంపై మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

అనంతపురం: చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం లేదని మాజీ  ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజధానిని మూడు ముక్కలు చేయడం అంత సులభం కాదని ఆయన చెప్పారు.

Also read:మూడు రాజధానులు... అందరూ గౌరవించాల్సిందే.. జేసీ దివాకర్ రెడ్డి

బుధవారం  నాడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం తలను విశాఖపట్టణానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని  జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. రాజధాని తరలింపు అంత సులభం కాదన్నారు. అయితే ఈ విషయమై కోర్టులున్నాయి,  కేంద్ర ప్రభుత్వం కూడ ఉందని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

వేసుకొన్న బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఎవరూ ఏమీ చేయలేరని మూడు రాజధానులపై జేసీ దివాకర్  రెడ్డి వ్యాఖ్యానించారు. భూముల కొనుగోలులో టీడీపీ, వైసీపీ దొందూ దొందేనని జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం