పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

Published : Oct 25, 2018, 04:13 PM IST
పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

సారాంశం

పాపులారిటీ కోసమే  జగన్‌పై శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో తేలినట్టుగా  విశాఖ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

విశాఖపట్టణం: పాపులారిటీ కోసమే  జగన్‌పై శ్రీనివాసరావు దాడికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా దర్యాప్తులో తేలినట్టుగా  విశాఖ పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నట్టు ఆయన తెలిపారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటనపై విశాఖ వెస్ట్ సీపీ అర్జున్,  అసిస్టెంట్ సీపీలు గురువారం నాడు విశాఖలో మీడియాతో మాట్లాడారు.  వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌‌పై దాడి ఘటనపై  డీజీపీ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు.

శ్రీనివాసరావు దాడికి పాల్పడిన వెంటనే సీఐఎస్ఎఫ్ పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారని చెప్పారు. అయితే  శ్రీనివాస్ జగన్ అభిమాని అని  తమకు అందిన సమాచారం మేరకు తేలిందన్నారు. 

సిట్  దర్యాప్తు చేస్తున్నట్టు విశాఖ వెస్ట్ ఏసీపీ అర్జున్  చెప్పారు. విమానాశ్రయంలో  సాక్ష్యాలను  సీఐఎస్ఎఫ్‌ నుండి సేకరించనున్నట్టు చెప్పారు.ఈ ఘటన మధ్యాహ్నం 12.34 నిమిషాలకు చోటు చేసుకొందన్నారు.  శ్రీనివాస్ పై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. సిట్ ఈ ఘటనను విచారించనున్నట్టు చెప్పారు.  శ్రీనివాస్ వద్ద దొరికిన  లేఖలను మీడియాకు  విడుదల చేస్తామన్నారు.
 

సంబంధిత వార్తలు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే