
Visakhapatnam : గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. నగరంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలోని ఓ వెల్డింగ్ దుకాణంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి అక్కడున్న ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు... మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనాస్థలంలో పరిస్థితిని చూస్తే ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ గ్యాస్ పేలుడుపై సమాచారం అందినవెంటనే ఫైర్, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.