చంద్రబాబుపై పోటీ చేస్తా: విజయసాయి రెడ్డి ప్రకటన

First Published May 4, 2018, 7:20 AM IST
Highlights

తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తాను పోటీ చేస్తానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చెప్పారు.

విశాఖపట్నం: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తాను పోటీ చేస్తానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి చెప్పారు. జగన్ ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా ఆయన విశాఖపట్నంలోని గాజువాకలో గురువారం పాదయాత్ర చేశారు. 

తెలుగుదేశం నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఉండి ఏమీ సాధించలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ సాధనలో చంద్రబాబు విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉండి దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు 

తమ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, టీడీపికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. నాలుగేళ్లలో రాజధాని నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని అన్నారు.  

ఎపిలో రాక్షస పాలన సాగుతోందని అన్నారు. ఎపీని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ దోచేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాలుగేళ్లలో రూ.3 లక్షల కోట్లు దోచుకున్నారని అన్నారు. హిట్లర్ గోబెల్ లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

వైసిపికి 25 ఎంపీ స్థానాలు వస్తే ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని ఆయన అన్నారు. పెద్ద నోట్లన్నీ చంద్రబాబు ఖజానాలోకి వెళ్లాయని, అందుకే ఎటీఎంల్లో డబ్బులు లేవని ఆయన వ్యాఖ్యానించారు.

click me!