ఎస్వీబీసీలో పోర్న్ లింక్ కేసు: ఉద్యోగి హార్డ్ డిస్క్‌లో మొత్తం అవే..!!

By Siva KodatiFirst Published Nov 12, 2020, 6:29 PM IST
Highlights

తిరుమల ఎస్వీబీసీ కార్యాలయంలో సైబర్ టీమ్ సోదాలు కొనసాగుతున్నాయి. ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి హార్డ్ డిస్క్‌లో పూర్తిగా పోర్న్ వీడియోలను గుర్తించింది సైబర్ టీమ్

తిరుమల ఎస్వీబీసీ కార్యాలయంలో సైబర్ టీమ్ సోదాలు కొనసాగుతున్నాయి. ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి హార్డ్ డిస్క్‌లో పూర్తిగా పోర్న్ వీడియోలను గుర్తించింది సైబర్ టీమ్.

కార్యాలయంలోని ఐదు హార్డ్ డిస్క్‌లతో పాటు, మూడు కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. పోర్న్ వీడియో లింక్ ఘటనలో మరో ముగ్గురు ఉద్యోగులపై వేటు పడే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు ఎస్వీబీసీలో పోర్న్ వీడియో ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీటీడీ ఉద్యోగ సంఘ నేతలు. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తించిన ఉద్యోగస్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎస్వీబీసీ కార్యాలయంలో వున్న కంప్యూటర్లన్నీ ఆడిటింగ్ నిర్వహించి బాధితులను గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతకు ముందు ఎస్వీబీసీలో పోర్న్ సైట్ లింక్ కలకలం రేపింది.

శతమానం భవతి కార్యక్రమానికి సంబంధించి ఓ భక్తుడు.. ఎస్వీబీసీకి మెయిల్ చేయగా, తిరిగి ఆ భక్తుడికి ఎస్వీబీసీలోని ఉద్యోగి పోర్న్ సైట్ లింక్ పంపాడు. దీనిపై ఆ భక్తుడు టీటీడీ ఛైర్మన్, ఈవోలకు ఫిర్యాదు చేశాడు.

ఘటనపై తీవ్రంగా స్పందించిన ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహార్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఎస్వీబీసీ ఆఫీసులో తనిఖీలు చేసిన టీటీడీ విజిలెన్స్ , సైబర్ క్రైమ్, ఈడీపీ అధికారులు.. పోర్న్ సైట్లను చూస్తున్న ఐదుగురు ఉద్యోగులను గుర్తించారు.

భక్తుడికి పోర్న్ సైట్ లింక్ పంపిన ఉద్యోగిని కూడా గుర్తించారు. అంతేకాకుండా విధులు  నిర్వహించకుండా ఇతర వీడియోలు చూస్తోన్న 25 మంది సిబ్బందిని కూడా గుర్తించారు.  
 

click me!