అన్ని ప్రముఖ వార్తాపత్రికల్లోని వార్తాకథనాల సమాహారం టాప్ స్టోరీస్. తెలంగాణలో అప్పుడే ఓట్ల నమోదు ప్రారంభమయ్యింది. ఉత్తరాఖండ్ సొరంగంలో కార్మికులు క్షేమంగానే ఉన్నారు. మత్స్యాకారుల ఖాతాల్లోకి నగదు బదిలీ అయ్యింది. ఇలాంటి టాప్ టెన్ వార్తలు మీ కోసం..
ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల తొలి వీడియో..
ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్ చార్ధామ్ మార్గంలో నిర్మాణంలో ఉన్న ఉత్తరకాశి సొరంగంలో చిక్కుకున్న కూలీలకు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ లో ముందడుగు పడింది. సోమవారం రాత్రి సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో సహాయక సిబ్బంది వీడియో ద్వారా ముఖాముఖి మాట్లాడడారు. సొరంగంలోని శిధిలాల మధ్య నుండి ఓ పైపును విజయవంతంగా పంపించగలిగారు. దాని ద్వారానే కార్మికులతో మాట్లాడారు. కార్మికులకు ఆహారాన్ని, మంచినీటిని పంపించారు. ఈనెల 12న ఉత్తర కాశీ జిల్లాలోని సిలిక్యారా సొరంగం పాక్షికంగా కూలడంతో అందులో కార్మికులు చిక్కుకుపోయారు. వారిని రక్షించే ప్రయత్నాలు ఇప్పటికి ఆశావహంగా మారాయి. చిక్కుకున్న కార్మికులందరూ క్షేమమే అని తెలిపే ఒక వీడియోను విడుదల చేశారు. దీనికి సంబంధించిన కథనాన్ని ఈనాడు బ్యానర్ ఐటెంగా ‘అందరూ క్షేమమే’ అనే పేరుతో ప్రముఖంగా ప్రచురించింది.
undefined
Uttarkashi Tunnel first visuals : చిక్కుకున్న కార్మికులకు కిచిడీ, నీళ్ల బాటిళ్లు..(విజువల్స్)
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : పురందేశ్వరి
ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి తెలంగాణ రాజకీయాలపై వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఆమె మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపిహెచ్బిలో ఉన్న జనసేన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఇచ్చిన లక్ష ఉద్యోగాల హామీని మరిచిపోయిందని మండిపడ్డారు. తెలంగాణలో మార్పు అవసరమని ప్రజలు భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఉద్యోగులబర్తీని వాయిదా వేస్తూ వచ్చిందని… టిఎస్పిఎస్సి నోటిఫికేషన్లలో స్కాంలు చేసిందని ఆరోపించారు. ఈ వార్తను ఈనాడు మెయిన్ పేజీలో.. చిన్నగా ప్రచురించారు.
కేసీఆర్ పాలనపై పురందేశ్వరి విమర్శలు
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటీ సోదాలు
తెలంగాణలో మంగళవారం ఉదయం మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు నిర్వహించాయి. బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి వినోద్ ఇళ్లల్లో కూడా తనిఖీలు చేశారు. రాష్ట్ర రాజధానితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో పలు జిన్నింగ్ మిల్లుల్లో తెల్లవారుజామున మంగళవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో స్థానిక పోలీసుల సహాయంతో తనిఖీలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి వరకు కొనసాగాయి. దీనికి సంబంధించిన వార్తను ఈనాడు ప్రచురించింది.
మత్స్యకారులను ఆదుకుంటాం అండగా ఉన్నాం
ఆంధ్రప్రదేశ్లో ఓఎన్ జిసి సంస్థ పైప్లైన్ పనులతో జీవనోపాధి కోల్పోయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలకు చెందిన 23 వేల 458 మంది మత్స్యకార కుటుంబాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి వేశారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఓఎన్జిసితో నాలుగో విడతగా ఒక్కొక్కరికి నెలకు రూ.11,500 చొప్పున మొత్తాన్ని బదిలీ చేశారు. ఆరు నెలలకు గాను రూ. 69 వేల రూపాయలను ఒక్కొక్కరికి ఖాతాల్లోకి బదిలీ చేశారు. మొత్తంగా రూ. 161.86 కోట్ల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు విడుదల చేశారు. దీనికి సంబంధించిన వార్తను సాక్షి బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.
విశాఖలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు ఆర్ధిక సహాయం
చంద్రబాబు బెయిల్ పై సుప్రీంకు వెళ్ళిన సిఐడి
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో పూర్తిస్థాయి బెయిలును హైకోర్టు మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మంగళవారం స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీం లో దాఖలు చేసింది. ఈఎస్ఎల్ పీ తేలేంతవరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరింది. దీంట్లో చంద్రబాబును ప్రతివాదిగా చేర్చింది. సంబంధించిన వార్తను సాక్షి ‘హైకోర్టు తీర్పును రద్దు చేయండి’ అని బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది.
చంద్రబాబు బెయిల్‌పై సుప్రీంలో ఏపీ సీఐడీ పిటిషన్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి ఆధునిక వైద్య సదుపాయాలు
ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో గుండె జబ్బులకు అత్యాధునిక చికిత్సలను అందించేందుకు జగన్ ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి కథనాన్ని సాక్షి ప్రచురించింది. ఇందులో భాగంగా కర్నూలు, కాకినాడ జిజిహెచ్లలో కేథలాబ్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. కర్నూలు జిజిహెచ్ లో ఇప్పటికే ఈ పనులు మొదలయ్యాయి. ఈ వారంలోనే క్యాథలాబ్ యంత్రాల మీద ట్రయల్ రన్ ప్రారంభించబోతున్నారు. ఇక కాకినాడ జిజిహెచ్ లో రెండు వారాల్లో యంత్రాల అమెరికా ప్రక్రియ పూర్తవుతుంది. ఒక్కోచోట దీనికోసం 6 కోట్ల చొప్పున నిధులు వెచ్చిస్తోంది జగన్ ప్రభుత్వం.
కాంగ్రెస్కు 20 సీట్లే.. ఆ పార్టీకి ఓటేస్తే నిండా మునుగుడే…
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో చేసిన ఆరోపణలు సంబంధించిన వార్తను ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటమ్ గా ప్రచురించింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు సాగునీటికి కటకట ఉండేదని చెప్పుకొచ్చారు కేసీఆర్. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంటును తమ ప్రభుత్వం ఇస్తుందని… దీనివల్ల సాగునీరు సమృద్ధిగా అందుతుందని చెప్పుకొచ్చారు. దళిత బంధు లాంటి పథకం గురించి 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఆలోచన చేయలేదని విమర్శించారు.
కాంగ్రెస్‌లో డజను మంది సీఎం క్యాండిడేట్లు
సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దూకుడు పెంచిన ఈడి
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడి దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ పత్రిక యాజమాన్య సంస్థ యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు వెల్లడించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నేషనల్ పబ్లిషర్ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ మీద దాని హోల్డింగ్ కంపెనీ యంగ్ ఇండియన్ మీద ప్రొవిజినల్ అటాచ్మెంట్ ఆర్డర్ ను జారీ చేసినట్లుగా ఇది ప్రకటించింది.ఈడీ అధికారులు ఈ కేసులో ఇప్పటికే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గేలను ప్రశ్నించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు యంగ్ ఇండియన్ కంపెనీలో 38% వాటాలు ఉన్నాయి. దీనిమీద కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అభిషేక్ సింగ్వి స్పందిస్తూ.. ఈ కేసులో మోసం జరిగిందని ఇప్పటివరకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలోనే, ప్రజల దృష్టిని మళ్లించేందుకు బిజెపి కక్షపూరితంగా ఇలాంటి చర్యలకు దిగిందని ఆరోపణలు గుప్పించారు.
గాంధీ కుటుంబానికి చెందిన రూ. 752 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
తెలంగాణలో తొలి ఓటు నమోదు
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయలేని వారి కోసం ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. దీంట్లో భాగంగా మంగళవారం నాడు తెలంగాణలో తొలి ఓటు నమోదు అయింది. హైదరాబాద్, వనస్థలిపురం, ప్రశాంత్ నగర్ కాలనీలో ఉన్న 90 ఏళ్ల రాటకొండ తులసమ్మ అనే వృద్ధురాలు తన మొదటి ఓటును వినియోగించుకున్నారు. దీనికి సంబంధించిన ఆసక్తికర కథనాన్ని ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో ప్రచురించింది.
vote from home : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. మొదలైన ఓట్ ఫ్రం హోం..
పాఠ్యపుస్తకాల్లో రామాయణ, మహాభారతాలకు చోటు
పాఠశాల స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. పాఠశాల పాఠ్యప్రణాళికలను సవరించే కసరత్తును నూతన విద్యా విధానం 2020 ప్రకారం ఎన్సీఈఆర్టీ చేపట్టింది. గత ఏడాది సామాజిక శాస్త్రాలకు సంబంధించిన మార్పులు, చేర్పుల కోసం ఏడుగురు సభ్యులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కేరళకు చెందిన విద్యావేత్త సీఐ ఐజాక్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ కమిటీకి చెందిన తుది నివేదికలో పలు సిఫారసులు చేసింది. మంగళవారం నాడు కొన్ని సిఫారసులను కమిటీ చైర్మన్ ఐజాక్ మీడియాకు తెలిపారు. 7 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులకు రామాయణం మహాభారతాలను బోధించడం అవసరమని అన్నారు. దీనికి సంబంధించిన ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ప్రచురించింది.