అనుచిత వ్యాఖ్యలు : టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై రోజా పరువు నష్టం దావా .. మరో ఇద్దరిపై కూడా

Siva Kodati |  
Published : Nov 21, 2023, 08:27 PM IST
అనుచిత వ్యాఖ్యలు : టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తిపై రోజా పరువు నష్టం దావా .. మరో ఇద్దరిపై కూడా

సారాంశం

టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై పరువు నష్టం దావా వేశారు మంత్రి ఆర్కే రోజా.  బండారుతో పాటు నగర టీడీపీ ఇన్‌ఛార్జ్ గాలి భాను ప్రకాష్, టీవీ రాజేంద్ర ప్రసాద్‌లపై ఆమె మంగళవారం నగరి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. 

టీడీపీ సీనియర్ నేత , మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిపై పరువు నష్టం దావా వేశారు మంత్రి ఆర్కే రోజా. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను బండారుతో పాటు నగర టీడీపీ ఇన్‌ఛార్జ్ గాలి భాను ప్రకాష్, టీవీ రాజేంద్ర ప్రసాద్‌లపై ఆమె మంగళవారం నగరి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని రోజా పిటిషన్‌లో పేర్కొన్నారు. 

కాగా.. రోజాపై అసభ్య పదజాలంతో మాట్లాడరనే ఫిర్యాదుతో బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రోజా అసభ్యకర చిత్రాల్లో నటించిందని, తన దగ్గర సీడీలు కూడా వున్నాయని బండారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 504, 354ఏ, 505, 506, 509, 499, ఐటీ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు.

Also Read : ఇలాంటి మగాళ్లని అలా చేయడమే కరెక్ట్.. త్రిషపై అసభ్య వ్యాఖ్యలు, మన్సూర్ కి మంత్రి రోజా స్ట్రాంగ్ కౌంటర్

ఇక, బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను అక్టోబర్ 2న అరెస్ట్ చేశారు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఇదే సమయంలో బండారు సత్యనారాయణ మూర్తి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!