రేపు ఢిల్లీలో చంద్రబాబు పాదయాత్ర: రాష్ట్రపతిని కలవనున్న ఏపీ సీఎం

By Nagaraju penumalaFirst Published Feb 11, 2019, 9:28 PM IST
Highlights

ఇప్పటికే రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారు. 11 మందికి మాత్రమే రాష్ట్రపతి కార్యాలయం అవకాశం కల్పించడంతో ఎవరెవరు వెళ్లాల అనే అంశంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో సమావేశం కానున్నారు. 

ఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్ష విజయవంతం కావడంతో తెలుగుదేశం పార్టీ సంబరపడుతోంది. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని తీసుకెళ్లామని చెప్పుకుంటోంది. 

మోదీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా నైతిక విజయం సాధించామని అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేస్తున్నారు. దేశంలోని పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలు తరలిరావడాన్ని చంద్రబాబు నాయుడు శుభపరిణామంగా భావిస్తున్నారు. 

ఈ తరునంలో మరో అడుగు ముందుకు వేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని మరోమారు రాష్ట్రపతికి విన్నవించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నాం 12.30గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను చంద్రబాబు నాయుడు బృందం కలవనుంది. 

ఇప్పటికే రాష్ట్రపతి అనుమతి తీసుకున్నారు. 11 మందికి మాత్రమే రాష్ట్రపతి కార్యాలయం అవకాశం కల్పించడంతో ఎవరెవరు వెళ్లాల అనే అంశంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ అంశంపై మంగళవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో సమావేశం కానున్నారు. 

ఒక్క తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి వెళ్లాలా లేక జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలతో కలిసి వెళ్లాలా అనే అంశంపై చర్చించనున్నారు. అయితే ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు పెద్ద సంఖ్యలో పాదయాత్రగా వెళ్లాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నారు. ఈ పాదయాత్రలో రాష్ట్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఇప్పటికే ఆదేశించారు చంద్రబాబు నాయుడు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఆత్మహత్యలొద్దు, అర్జునరావు కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం: చంద్రబాబు

ఢిల్లీలో ముగిసిన చంద్రబాబు దీక్ష: విరమింపజేసిన మాజీప్రధాని దేవెగౌడ

నువ్వు భయపెడితే తిరగబడతాం, నిన్ను వదిలిపెట్టను: మోదీపై చంద్రబాబు

దేశమంతా మనవైపే ఉంది, నైతిక విజయం మనదే: చంద్రబాబు

హోదాపై రాజీలేని పోరాటం చేస్తా, అధైర్యపడొద్దు: చంద్రబాబు పిలుపు

 

click me!