ఆత్మహత్యలొద్దు, అర్జునరావు కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం: చంద్రబాబు

By Nagaraju penumalaFirst Published Feb 11, 2019, 9:15 PM IST
Highlights

అర్జునరావు మృతదేహానికి పోస్టుమార్టం కూడా చెయ్యలేదని చెయ్యాలని కోరుతూ కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అర్జునరావు అంత్యక్రియలు అధికారికంగా జరపాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఏపీ ఎంతటి మనస్థాపానికి లోనవుతుందో గుర్తించాలని చంద్రబాబు నాయుడు కోరారు. 
 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా తనకు ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్మపోరాట దీక్ష ముగింపు సభలో చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగుడు అర్జునరావు ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ఎవరూ అధైర్యపడొద్దన్నారు. ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దు అన్నారు. 

ఆంధ్రప్రదేశ్ వెంట భారతదేశం మెుత్తం ఉందని ప్రత్యేక హోదా సాధించి తీరుతామని ధైర్యంగా ఉండాలని కోరారు. రాజీలేని పోరాటం చేసి ప్రత్యేకహోదా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కొత్త రాష్ట్రం కాబట్టి కేంద్రం సాయం చేయకపోతుందా అని నాలుగేళ్లు ఎదురుచూశామని, ప్రత్యేకహోదా కన్నా మెరుగైన ప్యాకేజీ ఇస్తామంటే ఒప్పుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. కానీ ఏపీకి హోదా ఇవ్వకుండా మరో 11రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇవ్వడంతో తాను తిరుగుబాటు చేశానని చెప్పుకొచ్చారు. 

ఏపీకి ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగం చేసిన అర్జునరావు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అర్జునరావు కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. 

అర్జునరావు మృతదేహానికి పోస్టుమార్టం కూడా చెయ్యలేదని చెయ్యాలని కోరుతూ కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. అర్జునరావు అంత్యక్రియలు అధికారికంగా జరపాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ఏపీ ఎంతటి మనస్థాపానికి లోనవుతుందో గుర్తించాలని చంద్రబాబు నాయుడు కోరారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీలో ముగిసిన చంద్రబాబు దీక్ష: విరమింపజేసిన మాజీప్రధాని దేవెగౌడ

నువ్వు భయపెడితే తిరగబడతాం, నిన్ను వదిలిపెట్టను: మోదీపై చంద్రబాబు

దేశమంతా మనవైపే ఉంది, నైతిక విజయం మనదే: చంద్రబాబు

హోదాపై రాజీలేని పోరాటం చేస్తా, అధైర్యపడొద్దు: చంద్రబాబు పిలుపు

 

click me!